మరో ప్రూఫ్..”గుంటూరు కారం”తో పవన్ ని ప్రమోట్ చేస్తున్న త్రివిక్రమ్?

రానున్న రోజుల్లో టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో సెన్సేషనల్ కాంబినేషన్ సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వస్తున్నా “గుంటూరు కారం” కూడా ఒకటి. కాగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.

ఈ సినిమా రిలీజ్ సంక్రాంతికి మేకర్స్ ప్లాన్ చేయగా ఒకో సాంగ్ ని అయితే మేకర్స్ రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. అలానే నిన్న రెండో సాంగ్ పై అయితే అప్డేట్ ఇచ్చారు. మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ సినిమాతో దర్శకుడు త్రివిక్రమ్ పవన్ ని బాగా ప్రమోట్ చేస్తున్నాడని ఓ టాక్ ఉంది.

ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి తర్వాత వచ్చిన ఎన్నో పోస్టర్స్ లో భీమ్లా నాయక్, గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ మాదిరి లుక్స్ డ్రెస్సింగ్ కానీ లుంగీ లో లుక్స్ కానీ దింపారు. దీనితో పవన్ ఫ్యాక్టర్ ఈ సినిమాలో బాగా కనిపిస్తుండగా ఇప్పుడు నిన్న వచ్చిన పోస్టర్ లో కూడా పవన్ రిఫరెన్స్ గురూజీ ఇరికించాడు అని కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

నిన్న పోస్టర్ లో అయితే ఈ పోస్టర్ లో మహేష్ పక్కన చూస్తే పవన్ పార్టీ సింబల్ గాజు గ్లాస్ కనిపిస్తుంది. దీనితో ఈ రకంగా కూడా తాను పవన్ ని ప్రమోట్ చేస్తున్నాడని కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి వీటితో త్రివిక్రమ్ పవన్ ని పరోక్షంగా ప్రమోట్ చేస్తున్నాడా లేక యాదృచ్చికంగానే ఇవన్నీ జరిగాయా అనేది వారికే తెలియాలి మరి.