మహేష్ తో భారీ షూట్ ప్లాన్ చేసిన త్రివిక్రమ్.?

టాలీవుడ్ ఆల్ టైం హ్యాండ్సమ్ హంక్ సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే ఈ ఒక్క ఏడాదిలోనే కొన్ని కోలుకోలేని దెబ్బలు ఎదుర్కొన్నారు. మరి దీనితో మరింత బలంగా తాను మారి సినిమాలపై మరింత ద్రుష్టి పెట్టి అయితే మహేష్ సంసిద్ధం అయ్యాడు. ఇక ఇపుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో మహేష్ తనన కెరీర్ లో 28వ సినిమా చేస్తుండగా దీనిపై భారీ అంచనాలు కూడా సెట్టయ్యాయి.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం అయితే భారీ ఏక్షన్ డ్రామాగా ప్లాన్ చేస్తుండగా మేకర్స్ అయితే సుమారుగా 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆల్రెడీ ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నెక్స్ట్ షెడ్యూల్ కి మాత్రం ఎక్కువ సమయాన్నే తీసుకుంది.

ఇక ఇప్పుడు మాత్రం త్రివిక్రమ్ జెట్ స్పీడ్ అండ్ భారీ లెంగ్త్ ఉన్న షెడ్యూల్ ని అయితే ప్లాన్ చేసాడట. మరి ఈ షెడ్యూల్ అయితే ఏకంగా 60 రోజులు పాటు సాగుతుందని తెలుస్తుంది. దీనితో చాలా వరకు సినిమా షూట్ ఈ షెడ్యూల్ లో కంప్లీట్ అయిపోతుందని తెలుస్తుంది.

ఈ షూట్ ఐయే దాదాపు మార్చ్ ఏప్రిల్ వరకు సాగే ఛాన్స్ ఉందట. దీనితో అయితే ఈ సినిమాపై ఇప్పుడు ఈ అప్డేట్ తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ ఎస్ అయితే సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి ప్లాన్ చేసారు కానీ ఆగష్టు రిలీజ్ అయితే ఉండొచ్చని ఇప్పుడు తెలుస్తుంది.