వామ్మో సూపర్ పవర్ ఫుల్ టైటిల్ పెట్టిన త్రివిక్రమ్ – ఎన్‌టి‌ఆర్ ఫ్యాన్స్ కి పండగే.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మార్చ్ వరకు కంప్లీట్ కాబోతోందని సమాచారం. అందుకే ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాకి సన్నాహాలు మొదలయ్యాయి. దాదాపు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ కంప్లీట్ అయిందని సమాచారం. మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించబోతున్నారు.

RRR' Teaser: Jr NTR's First Look As Bheem In SS Rajamouli's Next Has Fans  Squealing - Entertainment

ఆర్ ఆర్ ఆర్ తో ఎన్టీఆర్ పాన్ ఇండియన్ స్టార్ గా క్రేజ్ దక్కబోతుండగా ఆర్ ఆర్ ఆర్ సినిమా రేంజ్ లోనే త్రివిక్రం – ఎన్టీఆర్ సినిమా కూడా భారీ పాన్ ఇండియన్ సినిమాగా ప్లాన్ చేస్తున్నారు. త్రివిక్రం – ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఇంతక ముందు అరవింద సమేత వీర రాఘవ సినిమా మంచి కమర్షియల్ హిట్ అందుకున్నారు. దాంతో ఇప్పుడు తెరకెక్కబోతున్న లేటెస్ట్ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Trivikram Srinivas On A Tight Rope Walk To Ready Pan-India Script For Jr  NTR Why Is Trivikram Restless About Jr NTR And RRR?

త్రివిక్రం – ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కబోతున్న సినిమా కి సాలీడ్ టైటిల్ ని అనుకుంటున్నట్టు సమాచారం. నిన్నా మొన్నటి వరకు ఈ సినిమాకి అయినను పోయిరావలె హస్తినకు అన్న టైటిల్ ప్రచారం లో ఉంది. కాగా ఇప్పుడు ఈ సినిమాకి చౌడప్ప నాయుడు అన్న టైటిల్ ని మేకర్స్ పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. చౌడప్ప నాయుడు ఎన్టీఆర్ కి పర్ఫెక్ట్ గా సూటవుతుందని చాలా పవర్‌ఫుల్ గా ఉందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఇక దాదాపు ఈ టైటిల్ నే మేకర్స్ ఫైనల్ చేసినట్టు త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని సమాచారం.