బ్రో… గురూజీ అంత తీసుకున్నారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మూవీ బ్రో. సముద్రఖని దర్శకత్వంలో సిద్ధమవుతోన్న ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. జులై 28న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. భారీ బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈచిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ థీయాట్రికల్ బిజినెస్ కంప్లీట్అయ్యింది.

వంద కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో సినిమాకి ఎలాంటి టెన్షన్ లేదు. అయితే ఏపీలో మాత్రం బ్రో రిలీజ్ ముందు ప్రభుత్వం నుంచి ఏవైనా అడ్డంకులు వస్తాయేమో అనే టెన్షన్ బయ్యర్లలో ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తమిళంలో సముద్రఖని దర్శకత్వం వహించి నటించిన వినోదాయ సీతమ్ రీమేక్ గా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

అయితే తెలుగు నేటివిటీకి సరిపోయే విధంగా కథలో కొన్ని మార్పులు చేయడంతో స్క్రీన్ ప్లే, డైలాగ్స్ పవర్ స్టార్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకొని త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసారంట. అయితే కేవలం రైటింగ్ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీ ఏకంగా 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారంట. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఒక రచయితగా హైయెస్ట్ పెయిడ్ అందుకున్న స్టార్ గా త్రివిక్రమ్ బ్రో సినిమాతో రికార్డు సృష్టించారని చెప్పొచ్చు.

తేజ్ రెమ్యునరేషన్ కంటే త్రివిక్రమ్ బ్రో సినిమా కోసం ఎక్కువ తీసుకోవడం విశేషం. పవన్ కళ్యాణ్ తర్వాత ఈ సినిమాకి హైయెస్ట్ పెయిడ్ అందుకున్నది కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ నే. వీరిద్దరి రెమ్యునరేషన్ ద్వారానే 60 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది.

మరి పీపుల్స్ మీడియా పెట్టిన పెట్టుబడికి తగ్గట్లుగా బ్రో సినిమా కలెక్షన్స్ సాదిస్తుందా లేదా అనేది మరో 12 రోజుల్లో తెలిసిపోతుంది. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత గత రెండేళ్ళ కాలంలో రెండు సినిమాలు చేశారు. ఈ రెండింటికి ఏపీలో వైసీపీ ప్రభుత్వం నుంచి అడ్డంకులు ఏర్పడ్డాయి. మరి బ్రో మూవీ పరిస్థితి ఎలా ఉంటుందనేది చూడాలి.