షాకింగ్ : “గుంటూరు కారం” కూడా కాపీనా గురూజీ..??

రాబోతున్న సంక్రాంతి కానుకగా అయితే టాలీవుడ్ నుంచి ఉన్న పెద్ద చిత్రం “గుంటూరు కారం” కూడా ఒకటి. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రం మహేష్ కెరీర్ 28వ సినిమా ఇంకా దర్శకుడు త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ సినిమా కావడంతో అంచనాలు కూసింత గట్టిగానే ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో ఓ షాకింగ్ రిపోర్ట్ సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. త్రివిక్రమ్ ఫిల్మో గ్రఫీ చూస్తే తన మొదటి సినిమా నుంచి గత అల వైకుంఠపురములో సినిమా వరకు కూడా ఏదొక అంశం కాపీ కనిపిస్తుంది. అయితే సినిమా స్టోరీ కానీ లేకపోతే పాటలో ఓ ఏక్షన్ సీక్వెన్స్ అయినా కూడా గురూజీ కాపీ కొట్టినవే కనిపిస్తాయి.

ఇక ఇప్పుడు గుంటూరు కారం కి కూడా ఇదే టాక్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాని అయితే తాను “కీర్తి కిరీటాలు” అనే నవల నుంచి కాపీ కొట్టి గుంటూరు కారంగా తెరకెక్కించాడు అని టాక్ స్టార్ట్ అయ్యింది. అయితే త్రివిక్రమ్ గత సినిమా అల వైకుంఠపురంలో కూడా పాత చిత్రం “ఇంటి గుట్టు” కథా లైన్ ని బేస్ చేసుకొని అల్లు అర్జున్ కి తగ్గట్టుగా మార్చి తీసేసాడు.

దీనితో ఇప్పుడు మళ్ళీ గుంటూరు కారంపై కూడా ఇదే తరహా వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే గురూజీ మళ్ళీ మరో కాపీ కొట్టారా లేదా అనేది ట్రైలర్ వచ్చాక అర్ధం అయిపోవచ్చు. కాగా ఈ ట్రైలర్ రేపు జనవరి 6న రిలీజ్ కాబోతుంది.