ప్రభాస్ కు 100 కోట్లు ఇవ్వడానికి చెక్ తీసుకొచ్చారట

prabhas
prabhas
prabhas

రెబల్ స్టార్ ప్రభాస్ కోసం దేశంలోని అగ్ర నిర్మాతలు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు మొదలుపెడతారు, ఎప్పుడు రిలీజ్ ఉంటుంది అనే సంగతుల్ని పక్కనబెట్టి ముందు ఆయన చేత ఒక్క సినిమా సైన్ చేయించుకుంటే చాలని ఉవ్విళ్లూరుతున్నారు అందరూ. కానీ ప్రభాస్ మాత్రం తొందరపడి ఎవ్వరికీ మాట ఇవ్వట్లేదు. భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తామన్నా టెంప్ట్ కావట్లేదు. ప్రజెంట్ ఆయన ‘రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్’ సినిమాలు, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ మీద ఒక సినిమా చేస్తున్నారు. మరే సినిమాలకూ సైన్ చేయలేదు. అయితే ఆయన్ను అప్రోచ్ అయ్యే నిర్మాతలు మాత్రం తగ్గడంలేదు.

నిత్యం ప్రభాస్ ను కలుస్తూ డేట్ల కోసం ట్రై చేస్తున్నారు. తెలుగు నిర్మాతలు ఎలా ఉన్నా బాలీవుడ్ నిర్మాతలు మాత్రం ప్రభాస్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఈమధ్యనే ప్రముఖ నిర్మాణ సంస్థలైన యాష్ రాజ్ ఫిలిమ్స్, ధర్మ ప్రొడక్షన్స్, నిర్మాత సాజిద్ నడియాద్వాల ప్రభాస్ ను అప్రోచ్ అయ్యారట. కథ, డైరెక్టర్ లాంటి సంగతుల్ని పక్కనబెట్టి తమకు డేట్లు కేటాయిస్తే చాలని అడిగారట. అంతేకాదు తమతో సినిమాకు ఒప్పుకుంటే స్పాట్లో 100 కోట్లకు చెక్ రాసివ్వడానికి రెడీ అన్నారట. ఇలా అడ్వాన్స్ రూపంలోనే 100 కోట్లు ఆఫర్ చేశారంటే ప్రభాస్ స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరి ప్రభాస్ వాళ్ళ ఆఫర్ కు అంగీకరించారో లేకపోతే ప్రజెంట్ ఉన్న సినిమాలు పూర్తయ్యాక చూద్దాంలే అని వెనక్కు పంపారో.