Cinema releases: ఈ ఏడాది వేసవి మొత్తం సినిమాలతో ప్యాక్ అయినట్టే. పెద్ద స్టార్స్ అందరు వారి సినిమాల విడుదలను వేసవి ముహూర్తానికి ఖరారు చేసుకున్నారు.ఇక చిన్న సినిమాల సంగతి చెప్పనక్కరలేదు. వేసవి సెలవులు కారణంగా సినీ మార్కెట్ కు మంచి బిజినెస్ జరుగుతుందని ఎక్కువ సినిమాలను అపుడు విడుదల చేయడానికి ఆసక్తి చూపుతారు దర్శక నిర్మాతలు.
ఇక ఈ రేస్ లో నేను ఫస్ట్ అంటూ ప్రీ సమ్మర్ రిలీజ్ గా ఆర్ఆర్ఆర్ బోణి కొట్టేసింది. ఇక ఆర్ఆర్ఆర్ దెబ్బకు బాలీవుడ్ సినిమాలు కూడా బేంబేలెత్తుతున్నాయి. ఇక ఆచార్య, సర్కారు వారి పాట సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి.ఇవి చాలవన్నట్టు తమిళ సినిమాలు విజయ్ సేతుపతి నటించినా కన్మని రాంబో ఖతిజా, విజయ్ నటించినా బీస్ట్, ఇక మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ కేజిఎఫ్ 2 సిద్ధంగా ఉన్నాయి.ఈ పెద్ద సినిమాల మధ్యలో చిన్న సినిమాల సందడి మాములే.
ఇక పోస్ట్ సమ్మర్ సినిమాలుగా మరికొన్ని పెద్ద సినిమాలు విడుదలకు సన్నద్ధమవుతున్నాయి. కమల్ హాసన్ విక్రమ్ సినిమా భారీ అంచనాల నడుమ జూన్ 3 న విడుదలకు సిద్ధమైంది.ఇక తెలుగులో నాని నాజ్రీయ జంటగా నటించినా అంటే సుందరానికి జూన్ 10న విడుదలవుతోంది.ఇక మాస్ రాజా రవితేజ నటించిన పీరియాడిక్ సినిమా టైగర్ నాగేశ్వర్రావు జూన్ 17 న విడుదలకు రెడీ అయింది.
ఇక గోపీచంద్ నటించిన పక్కా కమర్షియల్, వైష్ణవ్ తేజ్ అంగ రంగ వైభవం, నితిన్ మాచర్ల నియోజక వర్గం, పోతినేని రామ్ వారియర్, నాగచైతన్య థాంక్యు జులై లో విడుదలకు ముహూర్తం పెట్టుకున్నాయి. ఎన్ని సినిమాలు వరుసగా సందడి చేస్తూ వేసవిno మరింత వేడెక్కించాయి. అయితే ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోణి కొడతాయో మాత్రం వేచి చూడాల్సిందే.