గాసిప్స్ : “పుష్ప 2” కి ఓవర్సీస్ లో ఓవర్ గా డిమాండ్ చేస్తున్నారట

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర భారీ హైప్ లో ఉన్న పలు రేర్ అండ్ తక్కువ చిత్రాల్లో అయితే మన తెలుగు నుంచి రానున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “పుష్ప 2” కూడా ఒకటి. పాన్ ఇండియా ఇక స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ కి సీక్వెల్ గా ఇది తెరకెక్కుతూ ఉండగా ఈ సినిమాపై హైప్ ఇప్పుడు తారా స్థాయిలో ఉంది.

మరి ఈ హైప్ తోనే మేకర్స్ ఓ రేంజ్ లో దానిని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు ఇది వరకే ఎప్పుడో ఈ సినిమా బిజినెస్ పై ఊహించని రూమర్స్ స్టార్ట్ కాగా ఇపుడు అదే విదాంగా ఓవర్సీస్ బిజినెస్ కి సంబంధించి కొన్ని కొత్త గాసిప్స్ షాకింగ్ గా మారాయి. దీనితో అయితే ఓవర్సీస్ హక్కుల కోసం నిర్మాతలు ఏకంగా 100 కోట్లు డిమాండ్ చేస్తున్నారట.

ఇది మామూలు నెంబర్ కాదని చెప్పాలి. అయితే డీల్ ఇంకా స్టార్ట్ అవ్వాల్సి ఉంది కానీ నిర్మాతలు స్టార్ట్ చేయడం 100 కోట్ల నుంచి అంటే అసలు ఇది ఇండియన్ సినిమా దగ్గరే ఏ సినిమాకి రాని రేట్ అని తెలుస్తుంది. హైయెస్ట్ గా ప్రభాస్ నటించిన సలార్ సినిమా దాదాపు 70 కోట్లకి వెళ్లగా ఓవర్సీస్ లో అంతగా మార్కెట్ లేని అల్లు అర్జున్ చిత్రానికి ఇంత మేర అంటే చాలా ఎక్కువే అని చెప్పాలి.

పుష్ప 1 బాగానే రన్ అయినప్పటికీ పార్ట్ 2 పై గట్టి హైప్ ఉంది కానీ ఇంత రేంజ్ బిజినెస్ అంటే ఏమాత్రం టాక్ అటు ఇటు అయ్యినా లాభాలు అటుంచితే భారీ నష్టాలు ఈ సినిమాకి తప్పవని చెప్పాలి. మరి ఈ సినిమాలో రష్మికా హీరోయిన్ గా నటిస్తుండగా వచ్చే ఏడాది ఆగష్టు లో సినిమా రిలీజ్ కాబోతుంది.