ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న భారీ హిట్ సినిమా “జవాన్” కోసం అందరికీ తెలిసిందే. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ కాగా పఠాన్ హిట్ స్ట్రీక్ ని అయితే ఇది కూడా కొనసాగిస్తుంది.
అయితే ఎప్పటి నుంచో బాలీవుడ్ హీరోలు తెలుగు మార్కెట్ పై కన్నేశారు కానీ అనుకున్న రేంజ్ పెర్ఫామెన్స్ అందుకోవట్లేదు. ఇదిలా ఉండగా మన తెలుగులో వసూళ్లు కాస్త బెటర్ కానీ తమిళ్ కానీ ఇతర భాషల్లో అయితే సినిమా డబ్ చేసిన ఖర్చులు కూడా వెనక్కి తెచ్చుకోలేకపోతున్నారు.
దీనితో పాన్ ఇండియా రిలీజ్ అంటే ఇక హిందీ తమిళ్ మరియు తెలుగు వరకే కుదించేశారు. ఇలా ఈ మూడు భాషల్లోనే రిలీజ్ కి వచ్చిన జవాన్ సినిమాకి మాత్రం తమిళ్ లో ఇప్పుడు చిల్లర మాత్రమే వస్తుంది అని ట్రేడ్ అంటున్నారు. ఈ సినిమాలో ఒక్క హీరో షారుఖ్ ఖాన్ మినహా హీరోయిన్, దర్శకుడు విలన్ సంగీత దర్శకుడు ఇలా అంతా తమిళ్ ఇండస్ట్రీ నుంచే ఉన్నప్పటికీ జవాన్ అక్కడ మినిమమ్ పది కోట్ల గ్రాస్ ని కూడా అందుకోలేకపోతుంది.
ఇక రెండో రోజు అయితే భారీ డ్రాప్ చూసిందట. ఇదిలా ఉంటే ఇంతకన్నా ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే తెలుగు నుంచి ఒక్క నటుడు లేకపోయినా ఎలాంటి ప్రమోషన్స్ కూడా లేకపోయినా రెండో రోజు వసూళ్ళలో తెలుగు తమిళ్ కి కేవలం ఒక్క కోటి గ్రాస్ మాత్రమే వ్యత్యాసం ఉందట. దీనిబట్టి సినిమా విషయంలో ఎవరు ఎంత పర్టిక్యులర్ అనేది అర్ధం చేసుకోవాలి.