దేవరలో టాలీవుడ్ యంగ్ హీరో?

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం దేవర. హైవోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో పీరియాడిక్ జోనర్ లో ఈ చిత్రాన్ని కొరటాల సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు. భారీ బడ్జెట్ తో యువసుదా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.

ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సైఫ్ ఆలీఖాన్ సినిమాలో మెయిన్ విలన్ గా పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తున్నాడు. మూవీ కోసం స్టార్ క్యాస్టింగ్ ని కొరటాల శివ ఎంపిక చేశారు. ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి ప్రస్తుతం ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది.

దేవర సినిమాలో ఓ యంగ్ హీరోకి ఛాన్స్ ఉంటుందంట. ఆయన పాత్ర సినిమాలలో చాలా కీలకంగా కథని మలుపు తిప్పే విధంగా ఉంటుందనే ప్రచారం నడుస్తోంది. ఇక ఈ పాత్ర కోసం టాలీవుడ్ లో ఓ యంగ్ టాలెంటెడ్ హీరోని ఎంపిక చేయడం జరిగిందనే మాట వినిపిస్తోంది. తారక్ రికమండ్ చేసిన ఒకరిని కొరటాల ఫైనల్ చేసారంట.

అయితే ఆ హీరో ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఈ సినిమాలో ఒక్కో పాత్రని సర్ప్రైజింగ్ గా రివీల్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే యంగ్ హీరో పాత్రని కూడా సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఫస్ట్ లుక్ పోస్టర్ తో బయటపెట్టే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఓ వైపు కొరటాల ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తూ ఉన్నారు.

అదే సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో సాంగ్ చర్చలలో పాల్గొంటున్నాడు. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత తారక్ ఏడాది పాటు కొరటాల కోసం వెయిట్ చేసి మరి దేవర సినిమా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కచ్చితంగా దీంతో బ్లాక్ బస్టర్ హిట్ ని పాన్ ఇండియా లెవల్ లో జూనియర్ ఎన్టీఆర్ కి ఇవ్వాలని కసితో పని చేస్తున్నట్లు తెలుస్తోంది.