“ఆదిపురుష్” టీంకి నిద్ర లేకుండా చేస్తున్న టాలీవుడ్ యంగ్ డైరెక్టర్.?

అల్టీమేట్ గా సినిమా అనేది మన ఇండియన్ ఆడియెన్స్ లో కూడా నరనరాల్లో ఇంకిపోయింది అని చెప్పొచ్చు. మన తెలుగు సినిమాలో అయితే మరీ దారుణంగా చూస్తారు. ఏ బావున్నా సినిమా అయినా కూడా సౌత్ లో అయితే మన తెలుగులో చూసినంత ఎక్కువగా ఎక్కడా చూడలేదని చెప్పొచ్చు.

ఆ రేంజ్ లో మన వాళ్ళు సినిమాలు చూస్తారు. మరి అలాగే ఇప్పుడు సినిమాలు కూడా మన టాలీవుడ్ నుంచి నెక్స్ట్ లెవెల్లో వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు యువ దర్శకులు అయితే కొత్త కొత్త కాన్సెప్ట్ లతో అవుట్ ఆఫ్ ది బాక్స్ గా దుమ్ము లేపుతున్నారు. మరి అలంటి దర్శకుల్లో యంగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా ఒకడు.

తాను డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ సినిమానే “హనుమాన్”, ఎలాంటి బిగ్ స్టార్స్ లేకుండా కేవలం తన టేకింగ్ తో ఇప్పుడు సినిమాపై ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాగా ఇప్పుడు చెప్తున్నా “ఆదిపురుష్” కి తలనొప్పి తెచ్చిపెట్టాడు. ఆదిపురుష్ ని బాలీవుడ్ వాళ్ళు ఎంతో గ్రాండ్ గా 500 కోట్లు అంటూ డబ్బా కొట్టి టీజర్ తో బొమ్మల యానిమేషన్ ని చూపించారు.

ఇక అది చూసి లేటెస్ట్ గా వచ్చిన హనుమాన్ టీజర్ చూసిన వాళ్ళకి అయితే మైండ్ బ్లాక్ అయ్యింది. చాలా నాచురల్ అండ్ గ్రాండ్ విజువల్స్ తో అదిరిపోయే లెవెల్లో ఇది కనిపించగా ప్రభాస్ ఫ్యాన్స్ ఆవేదన ఇప్పుడు అంతా ఇంతా కాదు.

ఓంరౌత్ ని టాగ్ చేసి మరీ సినిమా అంటే ఇలా ఉండాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే హనుమాన్ బడ్జెట్ కూడా గట్టిగా చూసిన 50 కోట్ల కన్నా చాలా తక్కువే అని కూడా టాక్. మరి దీనితో అయితే హనుమాన్ చూసాక ఆదిపురుష్ టీం కి నిద్ర పట్టేలా లేదని చెప్పవచ్చు.