టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్..మనకే వార్నింగులు ఇస్తున్న ప్రముఖులు.!

ఇప్పుడు మన టాలీవుడ్ మరియు తమిళ సినిమా కోలీవుడ్ ఇండస్ట్రీ ల మధ్య పెద్ద రచ్చే జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. దళపతి విజయ్ నటిస్తున్న వరిసు సినిమా తెలుగు సినిమా రిలీజ్ వివాదాలు ఇప్పుడు బాగా ముదురుతున్నాయి. తెలుగులో ఈ సినిమా విడుదల ఏమో కానీ తమిళ్ ప్రముఖులే మన టాలీవుడ్ కి వార్నింగ్ ఇచ్చే వరకు వెళ్ళింది ఇప్పుడు వ్యవహారం..

దీనితో ఇప్పుడు అంతా మంచి గరం గరం గా ఉండగా కోలీవుడ్ దర్శకుడు అలాగే తెలుగులో రీసెంట్ గా “వారియర్” సినిమా తీసిన లింగుసామి వరిసు తెలుగు రిలీజ్ పై మాట్లాడుతూ విజయ్ సినిమా తెలుగు రిలీజ్ ఎమన్నా తేడా జరిగితే తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని అక్కడి మీడియాతో చెప్పడం విడ్డూరం.

అయితే తెలుగులో విజయ్ మార్కెట్ బాగానే ఉన్నా సంక్రాంతి బరిలో అప్పుడు ఆ సినిమా నిర్మాత దిల్ రాజు చెప్పినట్టుగా ఓ డబ్బింగ్ సినిమాకి ఎక్కువ థియేటర్స్ ఇస్తారు అనే మాట ఇప్పుడు దిల్ రాజుకే తగిలింది. దీనితో సినిమాకి తెలుగు లో ఎందుకు థియేటర్స్ ఉండవు అని పాయింట్ ఇప్పుడు ఇంత రచ్చకి దారి తీస్తుంది.

దీనితో ఇప్పుడు రానున్న రోజుల్లో పరిస్థితి టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ లా మారడం ఖాయంలా కనిపిస్తుంది. అయితే మన సినిమాలు డబ్బింగ్ చెయ్యాలి అంటే తమిళ్ లో ఎన్నో ఆంక్షలు పైగా డబ్బింగ్ ఖర్చులు కూడా అధికం పైగా అక్కడి జనం సినిమా సరిగ్గా చూడను కూడా చూడరు.

ఇంకా అక్కడి సినిమా హీరోలే మన తెలుగు ఆడియెన్స్ ని పొగిడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు కొందరు మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీకే వార్నింగ్ లు ఇవ్వడం అనేది కామెడీగా మారింది. మరి వ్యవహారం ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి.