సినిమా ఇండస్ట్రీ అంటే ఇక రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో అందానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందంతో పాటు దైర్యం, తెలివి ఉన్న వారే ఈ ఇండస్ట్రీ లో నిలదొక్కుకుని రాణిస్తారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్లు ఎన్నో సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. హీరోయిన్లుగా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఆడవాళ్లు ఇండస్ట్రీలో అవకాశాలు పొందాలంటే ఇండస్ట్రీలో ఉన్న కొందరు నిర్మాతలు, దర్శకులు, హీరోలకు కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఎంతోమంది హీరోయిన్లు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. గతంలో శ్రీ రెడ్డి కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంది. అవకాశాలు ఇస్తామని చెప్పి తనని వాడుకొని తర్వాత అవకాశాలు ఇవ్వకుండా అన్యాయం చేశారంటూ శ్రీ రెడ్డి ఫిలిం ఛాంబర్ ఎదురుగా ప్రదర్శన చేసింది.
ఇది ఒక ఉద్యమంలో మారి ఎంతోమంది తమకు ఎదురైన ఇలాంటి చేదు అనుభవాల గురించి బయటికి వెల్లడిస్తున్నారు. తాజాగా అలనాటి స్టార్ హీరోయిన్ ఖుష్బూ కూడా ఈ విషయం గురించి స్పందించింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన కుష్బూ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్ భాషలలో ఎన్నో సినిమాలలో నటించిన కుష్బూ తన అందం, అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కుష్బూ మాట్లాడుతూ…. ఒక టాలీవుడ్ స్టార్ హీరో తనని కమిట్మెంట్ అడిగారని చెప్పుకొచ్చింది. అయితే కుష్బూ ధైర్యంగా మీ చెల్లిని మా అన్న దగ్గరికి పంపండి నేను మీకు కమిట్మెంట్ ఇస్తాను అని చెంప చెల్లు మన్నేలా సమాధానం చెప్పింది. అప్పటి నుండి ఆ హీరో తనతో మాట్లాడాలన్నా భయపడేవాడని కుష్బూ వెల్లడించింది.
తెలుగు తమిళ్ భాషలలో స్టార్ హీరోల సరసన నటించిన కుష్బూకి తన అభిమానులు గుడి కూడా నిర్మించారు. ప్రస్తుతం కుష్బూ సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించడమే కాకుండా బుల్లితెర మీద కూడా సందడి చేస్తోంది. గత కొంతకాలంగా టాలీవుడ్ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో కి జడ్జిగా వ్యవహరిస్తోంది. చాలా కాలం తర్వాత కుష్బూ ఇలా బుల్లితెర మీద కనిపించడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.