హీరోలే కాదు హీరోయిన్లలోనూ మూడు పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. మనం మాట్లాడుకునేది ఈ తరం నటీనటుల గురించి కాదండోయ్? పాత తరం నటుల గురించి. మీకు జయంతి, రాధిక, లక్ష్మీ లాంటి అలనాటి తారలు గుర్తున్నారా? వాళ్లలో జయంతి కూడా మీకు గుర్తుండే ఉంటారు.
ఆమె ఎన్టీఆర్ తో చాలా సినిమాల్లో నటించారు. మెప్పించారు కూడా. ఆమె నటన అద్భుతంగా ఉంటుంది. ఆమె సినీ జీవితంలో ఎటువంటి లోటుపాట్లు లేకున్నా.. ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఒడిదొడుకులు ఉన్నాయి.
ముఖ్యంగా ఆమె వైవాహిక జీవితం కూడా ఆమెకు ఎన్నో చేదు అనుభవాలను మిగిల్చింది. నిజానికి ఆమె మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. వాటిలో ఏ ఒక్క వైవాహిక జీవితం కూడా నిలబడలేదు.
జయంతి హీరోయిన్ గా ఉన్న సమయంలోనే పేకేటి శివరాం అనే నటుడు కమ్ డైరెక్టర్ ను వివాహమాడారు. అప్పుడే ఆమె అసలు పేరు కమలా కుమారిని కాస్త ఆయన జయంతిగా మార్చారు.
అలనాటి సినిమాలు అయినటువంటి లవకుశలో సీత పక్కన ఉండే చెల్లెల్లలో జయంతి ఒకరిగా నటించారు. జగదేకవీరుడి కథ సినిమాలోనూ నలుగురు హీరోయిన్లు ఉంటారు కదా. వాళ్లలో జయంతి ఒకరు. శివరాంను పెళ్లి చేసుకోకముందు.. ఇలాంటి చిన్న చిన్న పాత్రలను ఆమె చేసేవారు. ఆ తర్వాత ఆయన పలు అవకాశాలు ఇవ్వడంతో హీరోయిన్ పాత్రలను చేయడం మొదలు పెట్టారు జయంతి.
అయితే.. శివరాంను పెళ్లి చేసుకునే సమయానికే శివరాంకు పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఓ కొడుకు పుట్టాక జయంతి, శివరాం మధ్య గొడవలు వచ్చి ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత నిర్మాత బండారు గిరిబాబును జయంతి పెళ్లి చేసుకున్నారు. గిరిబాబును పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే జయంతి అతడితో విడిపోయారు.
ఆ తర్వాత కన్నడ హీరో రాజశేఖర్ ను ఆమె పెళ్లి చేసుకున్నారు. ఆయన జయంతి కన్నా 25 ఏళ్లు చిన్న. అయినప్పటికీ ఆమె ఆయన్ను పెళ్లి చేసుకొని.. హీరోగా చేయాలని భావించారు. కానీ.. కుదరలేదు. ఆమె చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. కొన్ని రోజులకే రాజశేఖర్ తో కూడా జయంతి విడిపోయారు. ఇలా..జయంతి చేసుకున్న మూడు పెళ్లిళ్లు పెటాకులు అయ్యాయి.
ఏది ఏమైనా.. ఆమె పోయిన తరంలో నటిగా చెరగని ముద్ర వేశారు. నటిగా విజయం సాధించారు. అదే ఇప్పుడు ఆమెను ఇండస్ట్రీ మొత్తం గుర్తుంచుకునేలా చేసింది.