టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒక్కరైనా విక్టరీ వెంకటేష్ తన విలక్షణమైన నటనతో ఎన్నో విలక్షణమైన సినిమాల్లో నటించి తెలుగు ప్రజల ఆదరభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.విక్టరీ వెంకటేష్ ప్రముఖ నిర్మాత రామానాయుడు కుమారుడైనప్పటికీ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.వెంకటేష్ తెలుగు ఇండస్ట్రీకి కలియుగ పాండవులు అనే సినిమా ద్వారా పరిచయమై తన మొదటి సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. తర్వాత వచ్చిన అన్ని సినిమాలు సక్సెస్ సాధించడంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలుగు ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు.

ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ సినిమాల్లో తక్కువగా నటిస్తున్నాడని చెప్పొచ్చు. తన 30 సంవత్సరాల సినీ జర్నీలో ఎందరో అభిమానులతో పాటు కోట్ల ఆస్తిని కూడా కూడబెట్టాడని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత రామానాయుడు వారసత్వంగా ఇచ్చిన 5000 కోట్ల రూపాయల ప్రాపర్టీ కి తోడు తాను సొంతంగా మరో రెండు వేల కోట్లు విలువ చేసి బంగ్లాలు, కార్లు, స్థలాలు
చెన్నై హైదరాబాద్ వంటి నగరాల్లో ఉన్నాయని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తుంటాయి.

విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాల్లో అద్భుతంగా నటించి ఫ్యామిలీ ఆడియన్స్ ఆకట్టుకోవడంలో దిట్ట అని చెప్పొచ్చు. విక్టరీ వెంకటేష్ నటించిన చంటి, సుందరకాండ, కలిసుందాం రా, ప్రేమించుకుందాం రా, పవిత్ర బంధం, సూర్యవంశం, లక్ష్మీ వంటి ఎన్నో కుటుంబ కథా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాయడంతో పాటు విక్టరీ వెంకటేష్ కెరియర్ లోనే ఓ మైలురాయి చిత్రాలుగా నిలిచాయనంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మధ్యకాలంలో విడుదలైన విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలైన ఎఫ్ 2, ఎఫ్ 3, దృశ్యం, వెంకీ మామ, నారప్ప వంటి సినిమాల్లో కూడా అద్భుతంగా నటించి తన బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుకున్నాడనే చెప్పొచ్చు.