అయోమయంలో కొత్త దర్శకులు.. సినిమాలు పోతున్నాయి

Tollywood new directors in confusiuon

Tollywood new directors in confusiuon

కరోనా సెకండ్ వేవ్ సినిమాలనే కాదు దర్శకులనూ ఇబ్బందిపెడుతోంది.పెద్ద దర్శకులేమో పెద్ద సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లి మధ్యలోనే ఆపాల్సిన పరిస్థితి. ఇలా స్టార్ డైరెక్టర్లు ఇబ్బందిపెడుతుంటే కొత్త దర్శకులు కూడ అలాంటి ఇబ్బందులే పడుతున్నారు. ఇటీవలే మొదటి సినిమాలతో హిట్ కొట్టిన డైరెక్టర్ల బాధ మరోలా ఉంది. లాక్ డౌన్ సమయంలో ఓటీటీల ద్వారా హిట్లు కొట్టిన దర్శకులు వినోద్ ఆనంతోజు, తేజ మార్ని. వీరు చేసిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్, జోహార్’ మంచి పేరు తెచ్చుకున్నాయి. దాంతో వారిద్దరికీ పెద్ద ఆఫర్లే వచ్చాయి.

వీరిలో ఒక్కోక్కరి మీద 25 కోట్లు పెట్టడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. వీరి ప్రాజెక్ట్స్ ఫైనల్ అయ్యాయి కూడ. ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగానే కరోనా సెకండ్ వేవ్ వచ్చిపడింది. ఈ ఎఫెక్ట్ వీరి సినిమాల మీద బలంగా పడింది. షూటింగ్స్ ఆగిపోయాయి, మొదలుకావాల్సిన సినిమాలు నిలిచిపోయాయి. థియేటర్లు మూతబడుతున్నాయి. దీంతో రెండు సినిమాలను ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిపిఉంచారట. ఎప్పుడు పూర్తి లాక్ డౌన్ పడుతుందో తెలియని పరిస్థితి కావడంతో నిర్మాతలు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేకపోతున్నారట వీరికి. దీంతో వీరి ప్రాజెక్ట్స్ అయోమయంలో పడినట్టే. మళ్లీ ఎప్పుడు రీస్టార్ట్ అవుతాయో చెప్పలేని పరిస్థితి.