టాలీవుడ్ ఇండస్ట్రీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఈ క్రమంలోనే గత నాలుగు రోజుల నుంచి ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు మరణించడంతో ఒక్కసారిగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ షాక్ కి గురయింది.ఒకరి మరణవార్త విన్న తర్వాత అతని మరణ వార్త నుంచి కోలుకోక ముందే వరుసగా మరో రెండు మరణాలు సంభవించడంతో అసలు టాలీవుడ్ పరిశ్రమకు ఏమైంది అన్నట్టు అందరూ షాక్ అయ్యారు.
ఈ క్రమంలోనే నవంబర్ 27వ తేదీ ప్రముఖ దర్శకుడు నాగేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందడం అందరినీ ఎంతో ఆందోళనకు గురి చేసింది. ఈ క్రమంలోనే ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు సెలబ్రిటీలు ఇతనికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఇక ఈయన మరణ వార్త నుంచి బయటపడక ముందే ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ ఆసుపత్రి పాలయ్యారని తెలియడంతో అందరూ కంగారు పడ్డారు. అందరూ కంగారు పడిన విధంగానే ఆయన కరోనాతో మృతి చెందారు. శివ శంకర్ మాస్టర్ మరణం తెలుగు తమిళ ఇండస్ట్రీకి తీరని లోటు అంటూ పలువురు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
ఇదిలా ఉండగా ఈ నెల 24వ తేదీ తీవ్రమైన అనారోగ్య సమస్యతో ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను సికింద్రాబాద్లోని కిమ్స్ కి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సిరివెన్నెల నవంబర్ 30 సాయంత్రం మృతి చెందారు. ఇలా మూడు రోజుల వ్యవధిలోనే ముగ్గురు స్టార్ సెలబ్రెటీలు మృతిచెందడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. అసలు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది అంటూ పలువురు సందేహాలను వ్యక్తపరుస్తూ మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మ శాంతించాలని ప్రార్థించారు.