June Box Office: జూన్‌లో సినిమా తుపాను.. బాక్సాఫీస్ కు బూస్ట్ ఇచ్చేనా?

ఈ మధ్య థియేటర్లలో సందడి లేక, చిన్న సినిమాల హవా తగ్గిపోవడంతో టాలీవుడ్ వ్యాపార వర్గాల్లో టెన్షన్ పెరిగిపోయింది. అయితే జూన్ నెల మాత్రం వెలుగులు నింపే అవకాశముంది. ఈ నెలలో వరుసగా నాలుగు భారీ సినిమాలు విడుదల కావడంతో పరిశ్రమలో పాజిటివ్ వాతావరణం నెలకొంటోంది. బిజినెస్ పరంగా ఈ నాలుగు సినిమాల మీద దాదాపు రూ. 200 కోట్ల వరకు థియేట్రికల్ వసూళ్లు ఆశిస్తున్నారు.

జూన్ 5న వస్తున్న థగ్ లైఫ్ డబ్బింగ్ మూవీ అయినప్పటికీ, కమల్ హాసన్, శింబు, త్రిష, మణిరత్నం కాంబినేషన్ తెలుగులోనూ హైప్ క్రియేట్ చేస్తోంది. తమిళనాట ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంటే, అదే హవా తెలుగులోనూ కొనసాగుతుంది. కంటెంట్ బలంగా ఉంటే కమల్ స్టామినాను తెలుగులో మళ్లీ నిలబెట్టే చాన్స్.

అసలైన బజ్ మాత్రం జూన్ 12న హరిహర వీరమల్లు పార్ట్ 1 తో రాబోతుంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న తొలి చిత్రం కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఏఎం రత్నం నిర్మాణంలో భారీ బడ్జెట్, దేవుడిగా పవన్ మాస్ అప్పీల్ కలిగించే పాత్రలో కనిపించబోతుండటంతో ఫ్యాన్స్ ఆల్రెడీ వేడెక్కుతున్నారు. మొదటి రోజు ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. టాక్ మాత్రం సినిమాకు కీలకం.

జూన్ 20న కుబేర వస్తోంది. ధనుష్-నాగార్జున కాంబినేషన్‌తో శేఖర్ కమ్ముల తీస్తున్న ఈ సినిమా క్లాస్, మాస్ రెండింటినీ టార్గెట్ చేస్తోంది. దేవిశ్రీ సంగీతం జోష్ పెంచుతుంది. అదే నెల 27న విష్ణు మోహన్ బాబు ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ కన్నప్పతో థియేటర్లలోకి వస్తాడు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ క్యామియోలు స్పెషల్ అట్రాక్షన్. ఉత్తరాదిన కూడా ఈ సినిమాకు క్రేజ్ ఉంటుందన్న విశ్వాసంతో, బిజినెస్ ఫాలోయింగ్ బాగానే కనిపిస్తోంది. ఈ నాలుగు సినిమాల్లో రెండైనా కాస్త హిట్ టాక్ అందుకుంటే… మిగతావి కూడా లాభదాయకం కావచ్చు. ఈ జూన్ సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వాలన్నది అందరి ఆశ.

పేదల ప'రేషన్‌' || Analyst Ks Prasad Fires On Chandrababu Over Cancel Ration Door Delivery || TR