తెలంగాణా వరద బాధితులకి అండగా నిలిచిన తెలుగు చిత్ర పరిశ్రమ ..!

2020 ల్యాండ్ మార్క్ ఇయర్ అని.. ఈ ఇయర్ లో ఎన్నో అద్భుతాలు జరుగుతాయని.. 2020 వ సంవత్సరం ప్రతీ ఒక్కరి జీవితంలో చేరగని ముద్ర వేస్తుందని భావించారు. నిజమే అదే జరిగింది. కాని అందరు భావించిన విధంగా సంతోషాలతో కాదు కష్టాలతో .. భయాలతో. 2019 ఆఖరులో మొదలైన కరోనా 2020 లో ప్రపంచ దేశాలతో పాటు భారత దేశాన్ని అతలాకుతలం చేసేసింది.

tollywood logo - Telugu Journalist

ఇప్పటికే కోవిడ్ 19 పరిస్థితులని తట్టుకొని నెమ్మదిగా జీవనం సాగించాలని భావిస్తున్న సమయంలో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలని వర్షాలు.. వరదలతో చిన్నా భిన్నం అయిపోయాయి. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా తెలంగాణా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకి ఎంతో మంది ప్రణాలు నీటిలో కలిసిపోయాయి. మరెన్నో కుటుంబాల పరిస్థితి అత్యంత ధీన స్థితిలో ఉన్నాయి. ఈ క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణా ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వచ్చింది. పలువురు సినీ తారలు తమ ఆర్ధిక సహాయాన్ని తెలంగాణా రాష్ట్ర సంక్షేమ నిధికి అందించారు.

నందమూరి బాలకృష్ణ రూ/- 1 కోటి. 50 లక్షల రూపాయలు

మెగాస్టార్ చిరంజీవి రూ/- 1 కోటి

మహేష్ బాబు రూ/- 1 కోటి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రూ/- 50 లక్షలు

విజయ్ దేవర కొండ రూ/-10 లక్షలు

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూ/- 5 లక్షలు

దర్శకుడు హరీష్ శంకర్ రూ/- 5 లక్షలు

దర్శకుడు అనిల్ రావిపూడి రూ/- 5 లక్షలు తెలంగాణా రాష్ట్ర సంక్షేమ నిధికి అందజేయనున్నట్టు ప్రకటించారు. వీరి తో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులు తమ ఆర్ధిక సహాయాన్ని అందజేయబోతున్నట్టు సమాచారం.