షారుఖ్ ని చూసి టాలీవుడ్ హీరోస్ చాలా నేర్చుకోవాలా?

Shahrukh Khan finally signs his comeback film?

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం “జవాన్” తో తన కెరీర్ లోనే అతి పెద్ద హిట్ ని అయితే తాను స్కోర్ చేసాడు. కాగా ఇదే ఏడాదిలో తన నుంచి ఇది రెండో సినిమా కాగా మొదటి సినిమా అయితే “పఠాన్” అని తెలిసిందే.

మరి ఈ సినిమా ఈ ఏడాదిలో జనవరిలో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ అయ్యి బాలీవుడ్ లోనే హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అంతే కాకుండా 1000 కోట్ల మార్క్ అనే దానిని కూడా ఈ చిత్రం చాలా సింపుల్ చేసేసింది. ఇక నెక్స్ట్ ఇదే ఏడాదిలో రెండో సినిమాతో షారుక్ మళ్ళీ పలకరించి పఠాన్ అంతు జవాన్ తో చూసాడు.

ఇదిలా ఉంటే మళ్ళీ ఇదే ఏడాదిలో షారుఖ్ ఖాన్ నటించిన మూడో చిత్రం “డన్కి” దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ బాలీవుడ్ లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ త్రి ఇడియట్స్, పీకే, పద్మావతి, గంగూబాయి ఖతియవాది లాంటివి తీసిన తనతో చేసిన సినీమా వచ్చేస్తుంది. దీనిని రీసెంట్ గా షారుఖ్ ఖానే కన్ఫర్మ్ చేసాడు.

తన మూడో సినిమా డిసెంబర్ లో ఉంటుంది అని చెప్పాడు. అయితే ఈ విషయంలో మాత్రం షారుఖ్ ని చూసి టాలీవుడ్ హీరోస్ చాలా నేర్చుకోవాలి అని అంటున్నారు. 6 పదులు వయసు దగ్గరగా ఉన్నా షారుక్ ఖాన్ ఏడాదిలో మూడు సినిమాలు రిలీజ్ చేస్తుంటే మనోళ్ళు మూడేళ్ళకి ఒక సినిమా చేస్తున్నారు. మెయిన్ గా యంగ్ హీరోస్ అయితే రెండు సినిమాలు కూడా డెలివర్ చేయలేకపోవడం బాధాకరం. ఈ విషయంలో మాత్రం షారుక్ నుంచి ఇది మనవాళ్ళు నేర్చుకోవాలి అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.