Home Entertainment టాలీవుడ్‌లో కూడా `డ్రగ్ బానిసలు` విచారణ చేస్తే మొత్తం బయటకి?

టాలీవుడ్‌లో కూడా `డ్రగ్ బానిసలు` విచారణ చేస్తే మొత్తం బయటకి?

టాలీవుడ్‌లో కూడా `డ్రగ్ బానిసలు` విచారణ చేస్తే మొత్తం బయటప‌డిపోతారా? అంటే అవున‌నే చెబుతోంది న‌టి మాధ‌వీల‌త‌. తాజాగా సోష‌ల్ మీడియాల్లో ఈ అమ్మ‌డి వ్యాఖ్య‌లు టాలీవుడ్ స‌ర్కిల్స్ లో పెనుదుమార‌మే అయ్యాయి. ఇంత‌కీ మాధ‌వీ ల‌త విప్పిన ఆ డ్ర‌గ్స్ బానిస‌లు ఎవ‌రు?..

Madhavi Latha Actress Hot Comments
madhavi latha actress hot comments

ఓవైపు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆక‌స్మిక మ‌ర‌ణం కేసులో సీబీఐ ప‌లువురిని విచారిస్తుంటే .. సీన్ లోకి ఎంటరైన కంగ‌న ర‌నౌత్ బాలీవుడ్ డ్ర‌గ్ మాఫియా గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఇందులో స్టార్ హీరోలు.. ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఉన్నార‌ని .. ర‌క్త శాంపిళ్ల‌తో బండారం బ‌య‌ట‌ప‌డిపోతుంద‌ని వ్యాఖ్యానించింది కంగ‌న‌. ఇప్ప‌టికీ ప‌లు చానెళ్ల ఇంట‌ర్వ్యూల్లో కంగ‌న స్టార్ హీరోల్ని పేరుతో స‌హా చెడామ‌డా తిట్టేయ‌డం సంచ‌ల‌న‌మ‌వుతోంది.

అదంతా స‌రేకానీ.. టాలీవుడ్ లో కూడా ఈ త‌ర‌హాలో డ్ర‌గ్స్ బానిస‌లు ఉన్నారా? అన్న స‌రికొత్త చ‌ర్చ‌కు తావిచ్చేలా హీరోయిన్ మాధ‌వీల‌త చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం అయ్యాయి. ఇక్క‌డా విచారిస్తే పెద్ద త‌ల‌కాయ‌లు దొరికిపోతాయ‌ని.. మ‌న పార్టీల్లో కూడా డ్ర‌గ్స్ విచ్ఛ‌ల‌విడిగా వినియోగిస్తార‌ని మాధ‌వీ వ్యాఖ్యానించారు. ఇలాంటి విష‌యాల్లో పోలీస్ విచార‌ణ సాగినా పెద్ద మ‌నుషులు బ‌య‌ట‌కు రానివ్వ‌కుండా తొక్కేస్తార‌ని కూడా భ‌యాన్ని వ్య‌క్తం చేసింది. అయితే మాధ‌వీల‌త మాత్రం త‌న‌కు తెలిసిన వారి పేర్ల‌ను బ‌య‌ట పెట్ట‌లేదు. ఒక‌వేళ ఇక్క‌డ సిట్ ద‌ర్యాప్తును మ‌రోసారి ఖాయం చేస్తే అప్పుడు బ‌య‌ట‌కు చెబుతుందేమో చూడాలి. ఇంత‌కీ టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఎవ‌రైనా మాద‌క ద్ర‌వ్యాలు పుచ్చుకునేవారున్నారా? ప్ర‌ముఖుల్లో ఎవ‌రెవ‌రు ఉన్నారు? అన్న‌ది మాధ‌వీల‌త‌ను ప్ర‌శ్నిస్తే చెబుతుందా? అన్న‌ది చూడాలి. మాధ‌వీల‌త ప్ర‌స్తుతం భాజ‌పా లో చేరి రాజ‌కీయాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

మాధ‌వీల‌త సోష‌ల్ మీడియా పోస్టింగ్ సారాంశ‌మిదీ..

సుశాంత్ కేసు లో అడుగు పెట్టడం మంచిదే
బాలీవుడ్ లో డ్రగ్స్ వాడకం బాగా ఉంది అన్నది నిజం
కానీ ఇదిగో అదిగో అని ఫైనల్ గ తుస్సుమనిపిస్తారేమో నాకు డౌట్
ఎందుకంటే అంతా బడా బాబులే కదా
అందులోను సినిమా రంగం ఇప్పటికే చెడ్డ పేరు అంటగట్టుకుంది
కానీ డ్రగ్స్ నేరం
ఒక పేదవాడికి అన్నం పెడతారో లేదో డ్రగ్స్ కి
1ప్యాకెట్ అంటారా గ్రాములు అంటారా?
ఎదో దానికి వేలు పెడతారు సరే అది వాళ్ళ ఇష్టం
ఇండియా లో పర్మిషన్ ఉన్నవి తినండి తాగండి
దేశానికి ఆదాయం పెంచుకుంటే పెంచుకోండి కానీ
ఇతర దేశాల మారక ద్యవ్యాలు ఎందుకు
ఆ మత్తులో జరిగే అరాచకాలు ఎవరు బయట పెట్టరు
అది సరే కానీ
తెలంగాణ NCBసార్లు మన టాలీవుడ్ మీద కూడా ఒక కన్నేయండి
పీతకన్నూ కాకుండా సీరియస్ కన్ను వేయండి
మన ఇండస్ట్రీ లో బాగా వాడుకలో ఉంది
అది లేకుండా కొన్ని పార్టీ లు జరగవు ఇక్కడ
2009 లో వచ్చారు పొలిటికల్ అండ తో వెనక్కి పోయారు
పాపం డీల్ చేసిన ఆఫీసర్ నోరు నొక్కేసి
ఇత‌ర డిపార్ట్ మెంట్స్ కి పడేసారు
చట్టానికి చేతులు చాల పెద్దవి అందుకే అవి చాచితే విరగొడతారు
చాల దారుణాలు జరుగుతున్నాయి మత్తులో
1. సినిమా వాళ్ళు
2.పబ్స్
3. స్టూడెంట్స్

బాగా వాడుతూ మాదక ద్యవ్యాల వారికీ బాగా ఆదాయాన్ని పెంచుతున్నారు

కాస్త చూసి అదుపులో పెట్టండి ….

ఇదీ సంగ‌తి:

ఆమ్మో నాకు భయం గా ఉంది ఈ పోస్ట్ పెట్టాను అని నన్ను ఎవరైనా బెదిరిస్తారేమో అని.. ఎవరు డ్రగ్స్ జోలికి పోరు ఆ అధికారులు కూడా చూసి చూడనట్లే ఉంటారు.. నిజంగా పట్టుకుంటే వాళ్ళకి భయం..
ఒకవేళ పట్టుకున్న ప్రభుత్వాలు ఎలాగూ వదిలేయి అని బయపెడతాయి కదా .. ఆఫీసర్స్ ని
సరేలే నాకేమన్నా అయితే చట్టం చేతకానితనం అని నేనే కేసు పెట్టాల్సి వస్తది ఏమో ….
అంటూ సుదీర్ఘ వ్యాసాన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది మాధ‌వీ ల‌త‌..

Related Posts

ప్రకాష్ రాజ్ వర్సెస్ విష్ణు: ‘మా’ యుద్ధంలో గెలుపెవరిది.?

సినీ పరిశ్రమలో నటీనటుల సంఘం 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' (మా) వుంది.. అందులో సభ్యుల సంఖ్య వెయ్యి లోపే. అందులో యాక్టివ్ మెంబర్స్ చాలా చాలా తక్కువ. కానీ, తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ,...

నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ గేమ్ ఛేంజర్ అవుతుందా.?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'లవ్ స్టోరీ' ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. ఈ సినిమా కంటే, నాగచైతన్య - సమంత విడిపోతున్నారా.? కలిసే వుంటారా.? అన్న...

పాపం సాయి పల్లవి కవరింగ్ వర్కవుట్ అవ్వట్లేదాయె

హీరోయిన్ సాయి పల్లవి, 'భోళా శంకర్' సినిమాలో నటించాల్సి వుంది.. అదీ, మెగాస్టార్ చిరంజీవి చెల్లెలి పాత్రలో. కానీ, ఆ సినిమాకి ఆమె 'నో' చెప్పింది. మామూలుగా అయితే, ఇలాంటి విషయాల్లో హీరోలు...

Related Posts

Latest News