కోవిడ్ -19 విజృంభించిన క్రమంలో సోనూసూద్ చేసిన సేవలు చూశాం. ఇదే తరహాలో ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా తన స్వచ్ఛంద సేవలతో అందరినీ ఆకట్టుకుంటోంది. కానీ దాతృత్వం కంటే, స్వచ్ఛంద సంస్థ కోసం ఆమె చేస్తున్న ప్రచారార్భాటం అందరినీ ఆకట్టుకుంటోంది.
సదరు హీరోయిన్ వాస్తవానికి ఈ ఛారిటీ పనులన్నీ చేస్తున్నా కానీ .. ఒక ప్రత్యేక కారణం కోసం ఇలా సేవాకార్యక్రమాల్ని భారీగా ప్రచారం చేస్తున్నారని కొన్ని పుకార్లు వస్తున్నాయి. నిజానికి అప్పట్లో మా అసోసియేషన్ గొడవల టైమ్ లో అమెరికాలో తెలుగు దంపతులను అరెస్టు చేసిన సంగతి ఎంతటి సంచలనమైందో తెలిసిందే. యుఎస్ఎలో జరిగిన ఒక సెక్స్ కుంభకోణం సినీ పరిశ్రమను కదిలించింది. అయితే ఆ గొడవలో అధికారికంగా ఏ పేరు బయటకు రాలేదు. దాని వల్ల మాత్రం కొంతమంది హీరోయిన్లు మాత్రం టాలీవుడ్ లో దాదాపు అన్ని అవకాశాలను కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అవకాశాల్లేక దారుణ సన్నివేశంలో ఉన్నారు కొందరైతే.
అప్పట్లో యుఎస్ కాన్సులేట్ వారి ప్రవర్తనకు మందలించి వదిలేసింది కానీ.. లేదంటే జైలు ఊచల్లెక్కించేవారని గుసగుసలు వినిపించాయి. అయితే ఇప్పటికీ ఆ స్కాండల్ లో దొరికిపోయిన నటీమణులకు యునైటెడ్ స్టేట్స్ వీసాలు దొరకడం లేదు. ప్రభుత్వాలు నిలిపివేసాయి. ఆ క్రమంలోనే సదరు హీరోయిన్ నిర్దోషి అని వాదించుకున్నా.. వీసా అధికారులు ఆమె మాటలను నమ్మడం లేదు. అయితే నమ్మించేందుకు నానా ప్రయాసలకు ఓరుస్తోంది. తాను చేస్తున్న మంచి పనులన్నింటినీ సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తూ అపరాధాన్ని తగ్గించుకునే పనిలో పడింది. ఈ టైప్ సేవ ద్వారా ఆ హీరోయిన్ తన వీసాను తిరిగి కోరుకుంటోందనే దానర్థం అని విశ్లేషిస్తున్నారు. ఇంతకీ అమెరికా వీసా ఆ అమ్మడికి దొరుకుతుందంటారా?