Tollywood: నేడు ఏపీ సీఎంతో భేటీ కానున్న టాలీవుడ్ పెద్దలు… అదే ప్రధాన కారణమా?

Tollywood: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన సంగతి మనకు తెలిసిందే. ఇలా రేవంత్ రెడ్డిని కలిసిన వీరు తెలంగాణలో సినిమాలకు ప్రత్యేకంగా బెనిఫిట్ షోలు అలాగే సినిమా టికెట్ల రేట్లకు కూడా అనుమతి తెలుపాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఇటీవల సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో దృష్టిలో పెట్టుకున్న రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు సినిమాలకు ఎలాంటి బెనిఫిట్ షోలు ఇవ్వనని తేల్చి చెప్పారు..

ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నామని తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీ నాకు వ్యతిరేకం కాదని సినిమా ఇండస్ట్రీకి అవసరమైనటువంటి భరోసా కల్పిస్తామని రేవంత్ రెడ్డి సినీ పెద్దలకు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ హామీలపై సినీ దర్శక నిర్మాతలు ఎవరు కూడా సంతృప్తి చెందలేదని స్పష్టంగా తెలుస్తోంది.

ఇకపోతే తాజాగా టాలీవుడ్ పెద్దలు నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని కలిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సంక్రాంతికి విడుదల కాబోయే సినిమాలకు బెనిఫిట్ షోలు టికెట్ల రేట్లతో పాటు సినిమా పరిశ్రమను అభివృద్ధిపరిచే అంశాల గురించి చర్చించబోతున్నారని తెలుస్తుంది. అదే విధంగా టాలీవుడ్ ఏపీకి తీసుకురావడం గురించి కూడా చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మధ్య గురుశిష్యుల అనుబంధం ఉన్న నేపథ్యంలో తెలంగాణలో సినిమాలకు బెనిఫిట్ షోల విషయం గురించి ఏపీ ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావిస్తూ తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతి పొందే ప్రయత్నాలు కూడా చేయబోతున్నారని సమాచారం. మరి చంద్రబాబు ద్వారా అయినా తెలంగాణలో సినీ పెద్దలు అనుకున్నది సాధిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.