Tollywood: ప్చ్..  బాబోయ్  ఈ హీరో అలాంటి బిజినెస్  చేస్తున్నాడా ?    

Tollywood: ఆ సీనియర్ హీరో గారికి  యాంగ్రీ మెన్ అని పేరు ఉంది. అగ్రెసివ్ క్యారెక్టర్లకు అయితే  ఆయన కేరాఫ్ అడ్రస్. పైగా పదిహేను ఏళ్ల క్రితం వరకు  మాస్ అండ్ యాక్షన్  సినిమాలతో,  ఆయన గారు బాక్సాఫీస్ దుమ్ము దులిపారు. కొన్ని చిత్రాల విషయంలో  ఆయనకు  నిజంగానే  ఆ రేంజ్ హిస్టరీ ఉంది. ఐతే, ఆ తర్వాత హిట్ లు పడలేదు. అవకాశాలు తగ్గాయి. రీమేక్ మూవీస్ ను నమ్ముకున్నాడు. అవి బాగా నిరాశ పరిచాయి. మంచి సైడ్ క్యారెక్టర్స్ తో మళ్లీ  ఫేమస్ అవ్వాలని ప్రయత్నాలు చేసినా  వర్కౌట్ కాలేదు.  మధ్యలో సొంత డబ్బు పెట్టి ఒకటి రెండు సినిమాలు ట్రై చేసినా కలిసి రాలేదు. మరోపక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా  ఎవ్వరూ ఛాన్స్ ఇవ్వని పరిస్థితి.

దాంతో,  ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని  ఆయన ఓ బిజినెస్ పెట్టాడు.  చూడటానికి చాలా డీసెంట్ గా కనిపించే ఈ హీరో..  ఇలాంటి బిజినెస్ చేస్తాడని ఎవ్వరూ ఊహించరు.  ప్రస్తుతం ఈ హీరో  ఓ లేడీస్ హాస్టల్ నడుపుతున్నాడు. ఆ హాస్టల్ లో చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని తెలిసి సినిమా వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. అక్కడ అమ్మాయిలు మందు కొట్టడం అనేది,  టీ తాగడం అన్నంత కామన్ పాయింట్ అట. పైగా  ఆ హాస్టల్ క్యాంటీన్ లోనే  మందు ను మజ్జిగ లా అమ్మేస్తున్నారు. నిజానికి ఈ హీరో ఈ హాస్టల్ కి  ఎప్పుడు వెళ్ళింది లేదు.

కానీ, పెట్టుబడి పెట్టింది మాత్రం ఈ హీరోనే.  మెయింటెన్స్ మొత్తం ఈయనగారి సతీమణి చూసుకుంటుంది. ఆమె  ఓ మేనేజర్ కమ్ ఫైనాన్సియర్ తో  ఆ హాస్టల్ తాలూకు అవసరాలన్నీ తీరుస్తోంది. పాపం.. ఈ హీరో ఫ్యామిలీ ప్రజెంట్ ఈ స్థాయికి దిగజారి పోవడం బాధాకరమైన విషయమే. ఈ హీరో ఫ్యామిలీ  సొంతంగా సినిమాలు తీసి సంపాదించింది మొత్తం పోగొట్టుకుంది. అంతా పోయాకే, ఈ ఫ్యామిలీ అలవాట్లులో  ఇలాంటి  అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి.  తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న హీరో గారికి  ఆయన గారి ఇద్దరు కూతుర్లు కూడా సపోర్ట్ గా నిలుస్తున్నారు.  ఇప్పటికే కూతుళ్ళిద్దరూ హీరోయిన్లుగా బిజీ కావడానికి కిందామీదా పడుతున్నారు.

ఐతే వాళ్ళు ఎన్ని పాట్లు పడుతున్నా.. అప్పులు మాత్రం తీరడం లేదు. సరే ఓన్ గా సినిమాలు చేద్దాం అంటే  కొత్తగా అప్పులు పుట్టడం లేదు. నిజానికి ఈయన గారితో సినిమాలు చేసిన ఇద్దరు కొత్త నిర్మాతలను  ఈ ఫ్యామిలీ బాగా ఇబ్బంది పెట్టింది. అందులో ఓ నిర్మాత, ఈ హీరో ఫ్యామిలీ పై కేసు కూడా పెట్టాడు. అయినా రీసెంట్ గా తన దగ్గరకు కొత్తగా వచ్చిన  మరో నిర్మాతతో  కూడా ఈ హీరో గొడవ పడ్డాడు. ఆ కొత్త నిర్మాత తో  అనుబంధాన్ని ఈ హీరో  సమర్థవంతంగా పెటాకులు చేసుకున్నాడు. పైగా ఈ మధ్య  ఈయన  తన పైత్యాన్ని  తన సతీమణికి కూడా అంటించాడు.

దాంతో ఆమె కూడా  అడ్డు అదుపు లేకుండా  రెచ్చిపోతుంది.  సినిమా సెట్స్ పైకి వెళ్లగానే  ఆమెలోని అపరిచితురాలు బయటకు వస్తుంది. ఇదెక్కడి గోలరా బాబు అంటూ ఇప్పటికే నిర్మాతలు, డైరెక్టర్లు ఈ హీరో ఫ్యామిలీని పక్కన పెడుతున్నారు. దీనికితోడు అప్పుల దెబ్బకు రీసెంట్ గా  హైదరాబాద్ లోని  శ్రీనగర్ కాలనీలోని తమ ఇంటిని కూడా అమ్మేశారు. మరి ఇలాంటి సమయంలో ఈ హీరో ఫ్యామిలీకి భరోసాని ఇస్తోంది ఆ లేడీస్ హాస్టల్ మాత్రమే.  కానీ తెల్లార్లూ మందు కొట్టుకుంటూ పోతే   ఆ హాస్టల్ గుట్టు మాత్రం ఎన్నాళ్ళు అని దాగి ఉంటుంది !!