ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సాయి పల్లవి ఎంత ఆస్తులను కూడా పెట్టిందో తెలుసా?

సాయి పల్లవి సింప్లిసిటీ కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఈమెను అందరూ నాచురల్ బ్యూటీ అని పిలుస్తారు. ఎలాంటి ఆడంబరాలకు పోకుండా ఎంతో సహజ సిద్ధంగా కనిపించడమే కాకుండా తన సహజమైన నటనతో అందరిని అలరింపజేసే సాయి పల్లవి వరుస తెలుగు తమిళ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈమె తాజాగా విరాటపర్వం, గార్గి అనే సినిమాలలో నటించి సందడి చేశారు.ఇకపోతే సాయి పల్లవి సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఈ క్రమంలోనే సాయి పల్లవి ఒక్కో సినిమాకు రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది.ఈ విధంగా ఈమె ఒక్కో సినిమాకు రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఏకంగా 30 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టినట్లు తెలుస్తోంది. ఇదంతా కూడా సాయి పల్లవి కేవలం సినిమాలలో నటించిన ఆస్తులు అని చెప్పాలి. ఇకపోతే సాయి పల్లవి ఏ విధమైనటువంటి ఖరీదైన చెప్పులు బ్యాగులు దుస్తులను కొనుగోలు చేయదు.

ఈమె దగ్గర కేవలం తనకెంతో ఇష్టమైన రెండు ఖరీదైన కార్లు మాత్రమే ఉన్నాయి. సాయి పల్లవి గ్యారేజీలో ఆడి q3 మిక్స్బిషల్ లాన్సర్ ఈవో ఎక్స్ మరియు మారుతి సుజుకి నెక్సా కార్లు ఉన్నాయి. తన దగ్గర ఉన్నటువంటి ఖరీదైన వస్తువులు ఈ కార్లు మాత్రమే అని చెప్పాలి.ఈ విధంగా సాయి పల్లవి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఎలాంటి హంగు ఆర్భాటాలకు పోకుండా సాధారణమైన జీవితం గడుపుతూ ఎంతో మందికి ఆదర్శంగా ఉందని చెప్పాలి.