2026 బాక్సాఫీస్.. టాలీవుడ్‌లో స్టార్ హీరోల నెవ్వర్ బిఫోర్ బ్లాస్టింగ్

2025లో టాలీవుడ్ టాప్ హీరోల సినిమాలు ఆశించినంత హైప్ క్రియేట్ చేయకపోవచ్చు కానీ 2026 మాత్రం రికార్డు స్థాయిలో బిజీగా మారే అవకాశం కనిపిస్తోంది. తెలుగు సినీ ఇండస్ట్రీలోని ప్రతి స్టార్ హీరో తన సినిమా రిలీజ్ కోసం రంగంలోకి దిగుతున్నాడు. సంక్రాంతి నుంచి క్రిస్మస్ వరకు వరుసగా భారీ చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.

2026 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఎంటర్టైనర్ ప్రేక్షకులను అలరించబోతోంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా, చిరు మాస్ రీ ఎంట్రీకి చక్కటి ఉదాహరణగా మారే అవకాశముంది. మార్చి నెలలో రామ్ చరణ్ పేద్ది చిత్రం, నాని ‘ప్యారడైజ్’ ఒకే వారం గ్యాప్‌లో విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

సమ్మర్ సీజన్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-హను రాఘవపూడి చిత్రం భారీ హైప్ మధ్యలో విడుదల కానుంది. అదే సమయంలో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు బన్నీ-అట్లీ చిత్రం షూటింగ్ ఆలస్యంగా ప్రారంభమైనా, 2026లో థియేటర్లలోకి రావడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఇక మాస్ హీరో బాలకృష్ణ, యూత్ ఫేవరెట్ విజయ్ దేవరకొండ సినిమాలు కూడా అదే ఏడాది ప్రేక్షకులను పలకరించనున్నాయి. మహేష్ బాబు -రాజమౌళి చిత్రం 2027 అని భావించినా, తాజా టాక్ ప్రకారం 2026 చివర్లో విడుదల చేసేలా ప్లాన్ జరుగుతోంది. దీంతో టాలీవుడ్ అభిమానులకు నెలకొక పండుగే. మిడ్ రేంజ్ హీరోల సినిమాలు కూడా ఈ ఏడాదిలో భాగస్వామ్యమవ్వడం ఖాయం. మొత్తంగా చెప్పాలంటే, 2026 సినిమా లవర్స్‌కు నిజమైన ఫెస్టివల్ గానే మారనుంది.