కథ, కాకరకాయ్ లేదు.! హీరోయిన్ గ్లామర్ మీదనే సినిమా.!

‘డీజే టిల్లు’ సినిమా గుర్తుంది కదా.? అంత తేలిగ్గా ఎలా మర్చిపోగలం.? పిచ్చ కామెడీ.. బోల్డంత రొమాన్సు.. వెరసి, అదో పెద్ద హిట్ సినిమా. అందులో కొంత ఎమోషన్ కూడా వర్కవుట్ అయ్యింది. తిక్క సినిమానే అయినా, చాలామందికి టైమ్ పాస్ అయ్యే సినిమా అది.

దానికి సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ సినిమా వచ్చేస్తోంది. ‘డీజే టిల్లు’లో నేహా శెట్టి గ్లామర్ చూశాం. ‘టిల్లు స్క్వేర్’లో అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ చూడబోతున్నాం. ‘టిల్లు స్క్వేర్’ సినిమాకి కథ కాకరకాయ్ ఏమీ లేవని సాక్షాత్తూ హీరో సిద్దు జొన్నలగడ్డ, నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో.

దర్శకుడు ఏం తీశాడో పట్టించుకోలేదనీ, తీసిన ఫుటేజ్ నుంచి కావాల్సింది తీసుకున్నామనీ నిర్లజ్జగా సిద్దు జొన్నలగడ్డ చెప్పడం గమనార్హం. ఇదేం పద్ధతి.? ఇంతకీ, ‘టిల్లు స్క్వేర్’ సినిమా సంగతేంటి.? అంటే, రాధిక ‘డీజే టిల్లు’లో ఏం చేసిందో చూశాం, లిల్లీ ఈ ‘టిల్లు స్క్వేర్’లో ఏం చేస్తోందో చూడబోతున్నారు.. అని చెప్పారు నిర్మాత.

వామ్మో.. సినిమాని ఇలాక్కూడా తీస్తారా.? కథ కాకరకాయ్.. ఇవేవీ లేకుండా కోట్లు గుమ్మరిస్తారా.? కాస్త ఆలోచించాల్సిన విషయమే. అన్నట్టు, హాట్ సీన్స్‌లో నటించడం చాలా తేలిక అని కొందరు అనుకుంటారనీ, అది చాలా కష్టమనీ అనుపమ చెప్పింది.

అసలేం జరుగుతోంది ‘టిల్లు స్క్వేర్’ సినిమాకి సంబంధించి.? మొత్తంగా అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ షో చుట్టూనే సినిమా బిజినెస్ ఆధారపడి వున్నట్లుంది. లేకపోతే, ఇదేం పబ్లిసిటీ తీరు.?

సెట్స్‌లో ఎలా అనిపించింది.? అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న వస్తే, దాన్ని ‘సెక్స్’ అని అర్థం చేసుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. కాస్సేపు అనుపమ, లేడీ యాంకర్.. వెకిలి నవ్వులు నవ్వారు. ఇది చాలదా, ‘టిల్లు స్క్వేర్’ కంటెంట్ ఏంటో చెప్పడానికి?