టీజర్ టాక్ : ప్రభాస్ “కల్కి” కి ఇది కాపీ లా ఉందే.. 

టాలీవుడ్ సినిమా సహా ఇండియన్ సినిమా కూడా ఇప్పుడే ఒకొక్క మెట్టు ఎక్కుతూ ప్రపంచ సినిమా దగ్గర అయితే అప్ గ్రేడ్ అవుతూ వస్తుంది. కాగా ఇలా వచ్చిన చిత్రాల్లో ఇండియన్ సినిమాని ఫ్యూచర్ కి తీసుకెళ్లే చిత్రాల్లో అయితే ఇప్పుడు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ చిత్రం “కల్కి 2898ఎడి} కూడా ఒకటి.

మరి ఈ చిత్రంలో ఫ్యూచర్ సహా గతానికి సంబంధించిన కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తుండగా ఈ టీజర్ చూసి అంతా వావ్ అనుకున్నారు. కాగా ఈ చిత్రం కోసం అంతా ఎదురు చూస్తుండగా లేటెస్ట్ గా బాలీవుడ్ సినిమా నుంచి వచ్చిన ఓ టీజర్ ఇప్పుడు షాకింగ్ గా మారింది.

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా దర్శకుడు వికాస్ బహ్ తెరకెక్కించిన “గణపత్” సినిమా నుంచి ఇపుడు మేకర్స్ సినిమా ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేశారు. అయితే షాకింగ్ గా ఈ టీజర్ స్టార్టింగ్ లోనే విజువల్స్ చూస్తే ప్రభాస్ కల్కి గుర్తు రాక మానదు. అందులో 2898 అయితే ఈ సినిమా 2070 లో చూపిస్తున్నారు.

దీంతో కాన్సెప్ట్ ఆల్ మోస్ట్ సేమ్ ఉంది. అంతే కాకుండా ఇందులో గణపతుని డివోషన్ టచ్ ని తీసుకున్నారు. అలాగే కొన్ని ఇంట్రెస్టింగ్ విజువల్స్ భారీ గ్రాఫిక్స్ హాలీవుడ్ సినిమాల్లో చూసిన వాటిలా కూడా ఉన్నాయి. హీరోయిన్ కృతి సనన్ ఈ సినిమాలో అదిరే స్టంట్స్ చేసేస్తుంది.

కొంచెం అటు ఇటుగా అయితే ప్రభాస్ కల్కి కి ఇది కాపీ లానే ఉంది పైగా కల్కి లో ఉన్న బిగ్ బి అమితాబ్ కూడా ఈ సినిమాలో ఉన్నారు. మరి ఈ యూనివర్సల్ కాన్సెప్ట్ తో ఎంతవరకు మంచి సక్సెస్ వారు అందుకుంటారో చూడాలి. కాగా ఈ సినిమా దసరా కానుకగా పాన్ ఇండియా లెవెల్లో అక్టోబర్ 20న రిలీజ్ కాబోతుంది. 
GANAPATH | Telugu Teaser | Amitabh B, Tiger S, Kriti S ❘ Vikas B, Jackky B | 20th Oct' 23