ప్రభాస్ బిగ్ మూవీ.. మళ్ళీ తగులుకున్న యూవీ!

నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌తో మరో పాన్-ఇండియన్ యాక్షన్ సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, యష్ రాజ్ ఫిల్మ్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ ప్రాజెక్ట్‌లో భారీగా పెట్టుబడి పెడుతుండగా, యువి క్రియేషన్స్ ప్రమేయం చాలా తక్కువగా ఉందని టాక్.

కేవలం తెలుగు థియేట్రికల్ హక్కులను మాత్రమే కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే యూవీ క్రియేషన్స్ ప్రభాస్ సినిమాల మధ్య బ్యాడ్ సెంటిమెంట్ పుకార్లు గట్టిగానే వచ్చాయి. UV క్రియేషన్స్ తెలుగు మార్కెట్‌లో ప్రభాస్ చిత్రాలను పంపిణీ చేయడానికి ఆసక్తి చూపుతోంది. ప్రభాస్ కూడా అందులో భాగమే అయినప్పటికీ యూవీ ట్యాగ్ బ్యాడ్ సెంటిమెంట్ గానే ఉంది.

సాహో రాధే శ్యామ్ ఫ్లాప్ అవ్వగా ఆదిపురుష్ కు ఈ సంస్థ డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఉంది. ఇక ఆ సినిమా గ్రాఫిక్స్ సమస్యల వలన వాయిదా పడింది. మొత్తంమీద, ప్రభాస్ అభిమానులు సిద్ధార్థ్ ఆనంద్‌తో చేయబోయే సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక దాని చుట్టూ ఉన్న హైప్‌కు అనుగుణంగానే మైత్రి ఆ సినిమాను నిర్మించే ఛాన్స్ ఉంది. ఇక ఆ సినిమాలో హృతిక్ రోషన్ కూడా మరో హీరోగా కనిపిస్తాడాని ఆ మధ్య ఒక టాక్ వచ్చిన విషయం తెలిసిందే.