అయ్యయ్యో –  ఇంకా స్టార్ట్ అయ్యే డేట్ కూడా చెప్పలేదు .. ఇలోపే ఇలా అయ్యింది ఏంటి!

bigg boss telugu season 4 confirmed list

బిగ్ బాస్ సీజ‌న్ 4 ఈనెల 30న‌ ప్రారంభం కావాల్సి ఉండ‌గా .. ఇప్ప‌టికే ఇంటి స‌భ్యులంతా క్వారంటైన్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్ లో ప్ర‌స్తుతం ప‌ద‌హారు మందిని ఎటూ వెళ్ల‌కుండా లాక్ చేశార‌ని స‌మాచారం. అంతేకాదు ఇప్ప‌టికే వీళ్లంద‌రికీ కోవిడ్ ప‌రీక్ష‌లు పూర్త‌య్యాయి.

three big boss 4 contestants attacked by corona
three big boss 4 contestants attacked by corona

తాజా స‌మాచారం ప్ర‌కారం.. బిగ్ బాస్ లో పాల్గొనాల్సిన ఓ ముగ్గురికి పాజిటివ్ అని తేల‌డంతో షో మ‌రో వారం పాటు ఆల‌స్యమవుతుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఆ ముగ్గురూ ఎవ‌రు? ఉన్న‌ట్టుండి ఇంత స‌డెన్ గా ఎలా బ‌య‌ట‌ప‌డింది క‌రోనా? అంటూ ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో ఒక‌టే ముచ్చ‌ట సాగుతోంది.

తాజా ప‌రిణామంతో ఆగ‌స్టు 30 నుంచి సెప్టెంబ‌ర్ 6 కి బిగ్ బాస్ వాయిదా ప‌డింద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. అయితే ఈ విష‌యాన్ని స్టార్ మా వాళ్లు ధృవీక‌రించ‌డం లేదు. ఇందులో నిజం ఎంత‌?  కేవ‌లం ప‌బ్లిసిటీ స్టంట్ అని భావించాలా.. అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది. వ‌రుస‌గా కోవిడ్ టెస్టులు చేస్తుంటే ఇంక్యుబేష‌న్ పీరియ‌డ్ లో ఏదీ బ‌య‌ట‌ప‌డ‌లేద‌. తాజాగా క‌రోనా ఇంక్యుబేష‌న్ పూర్త‌వ్వ‌డంతో ముగ్గురిలో క‌రోనా బ‌య‌ట‌ప‌డింద‌ని తెలుస్తోంది.