Allu Arjun – NTR: ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు బాలీవుడ్‌లో అడుగు పెట్టేందుకు గట్టిగా సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ చాలా మంది ప్రముఖ హీరోలు సైతం రిమేక్ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో రిలీజ్ అయిన సినిమాలు హిందీతో పాటు, ప్రస్తుతం పలు భాషల్లోనూ విడుదలవుతూ తెలుగు సినిమా ఖ్యాతిని రోజు రోజుకీ పెంచేస్తున్నాయి. బాహుబలి సినిమా పుణ్యమా అని ఆ కీర్తి దేశాలు దాటి పోయింది. దాంతో అన్ని ఇండస్ట్రీలు ఇప్పుడు తెలుగు సినిమా వైపు చూడటం మొదలుపెట్టాయి. మనం చేసిన చాలా సినిమాలు అక్కడ వేరే హీరో రీమేక్ చేసి కూడా భారీ విజయాలను అందుకుంటుండడం విశేషం. రీసెంట్ డేస్ లో అర్జున్ రెడ్డి సినిమా బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీమేక్ అయినా విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగులో ఎంత విజయం సాధించిందో హిందీలోనూ అదే రేంజ్ లో హిట్ ను అందుకొని ప్రేక్షకులను మెప్పించింది. ఇక ప్రభాస్ సాహో సినిమా అయితే హిందీలోనూ రిలీజ్ అయ్యి కలెక్షన్స్ వర్షం కురిపించింది. దాంతో ఇప్పుడు తెలుగు సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతున్నాయి.
కాగా ఇప్పటి వరకూ తెలుగు హీరోలు సైతం బాలీవుడ్ సినిమాలకు చాలా వరకు రిమేక్ చేసినప్పటికీ, పలువురు స్టార్ డమ్ ఉన్న హీరోలు మాత్రం నేరుగా హిందీలోనే సినిమా తీసేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఆ జాబితాలో ప్రభాస్, అల్లు అర్జున్, తారక్ లాంటి పెద్ద హీరోలు సైతం బాలీవుడ్ దర్శకులతో పని చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. ఇక ప్రభాస్ ఆది పురుష్ సినిమాతో తన కలను నిజం చేసుకున్నా, మిగతా హీరోలు మాత్రం ఇంకా సెర్చింగ్‌లోనే ఉన్నట్టు సినీ వర్గాల సమాచారం. ఇటీవల సంజయ్ బన్సాలీని కూడా బన్నీ అదే పని మీద కలిసినట్టు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.
ఇక ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఇదే బాటలో నడుస్తూ, ఆయన కూడా హిందీ సినిమాలో నటించేందుకు ఆసక్తి ఉన్నట్టు ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. మీకు హిందీలో ఎవరితో సినిమా చేయాలని ఉంది అన్న ప్రశ్నకు ఆయన టక్కున రాజ్ కుమార్ హిరానీ పేరు చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక తనకు సంజయ్ లీలా బన్సాలీ సినిమాలన్నా చాలా ఇష్టం అని తన మనసులోని మాటను చెప్పకనే చెప్పాడు తారక్.