గాసిప్స్ – “ఓజి”లో ఛాన్స్ కొట్టేసిన మరో యంగ్ హీరోయిన్.!

టాలీవుడ్ స్టార్ హీరో గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇపుడు నటిస్తున్న చిత్రాల్లో యంగ్ దర్శకుడు సుజీత్ తో చేస్తున్న భారీ బడ్జెట్ ఏక్షన్ డ్రామా చిత్రం “ఓజి” ది ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ కూడా ఒకటి. మరి ఈ మాసివ్ చిత్రం షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుండగా అభిమానులు కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఈ సినిమా విషయంలో ఉన్నారు.

అయితే ఈ చిత్రంలో పవన్ సరసన మొదటిసారి యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ నటిస్తుండగా ఇప్పుడు ఈ సినిమాపై మరో క్రేజీ గాసిప్ వైరల్ గా మారింది. ఈ చిత్రంలో అయితే మరో లేటెస్ట్ యంగ్ హీరోయిన్ ఐశ్వర్య మీనన్ కూడా నటిస్తున్నట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి.

ఈ యంగ్ బ్యూటీ మొన్నటి రిలీజ్ నిఖిల్ హీరోగా నటించిన “స్పై” చిత్రంలో ఉంది. మరి ఈమె అయితే ఇపుడు పవన్ ఓజి లో నటించే ఆఫర్ కొట్టేసినట్టుగా సినీ వర్గాల్లో లేటెస్ట్ టాక్. మరి ఈమెపై కూడా మేకర్స్ ఏమన్నా అప్డేట్ ఇస్తారేమో చూడాలి. ఇప్పటికే బాలీవుడ్ తమిళ్ నుంచి కూడా సాలిడ్ తారాగణం ఈ చిత్రంలో యాడ్ అవ్వడంతో అంచనాలు మరింత స్థాయికి వెళ్తున్నాయి.

ఇక ఈ హీరోయిన్ కూడా ఉందో లేదో చూడాలి. ఇక ఈ సినిమాకి అయితే థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఆర్ ఆర్ ఆర్ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో నిర్మాణం వహిస్తున్నారు.