ఇండస్ట్రీ టాక్ : “ఆదిపురుష్” ఈవెంట్ లో ఈ యంగ్ హీరోనే హైలైట్.?

ప్రస్తుతం భారీ అంచనాలు ఉన్న లేటెస్ట్ చిత్రాల్లో అయితే సెన్సేషనల్ విజువల్స్ డ్రామా చిత్రం “ఆదిపురుష్” మొదటి వరుస లో ఉంటుంది. ఇండియన్ సినిమా దగ్గర నుంచి గత రెండేళ్లలో RRR, బ్రహ్మాస్త్ర లాంటి మాసివ్ విజువల్ డ్రామా లు తర్వాత అయితే మళ్ళీ ఆ రేంజ్ సినిమాగా అయితే ఇప్పుడు ఆదిపురుష్ వస్తుంది.

కాగా ఈ చిత్రంలో హీరోగా ప్రభాస్ నటించగా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ఈ సినిమాని నిర్మాణం సహా దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కించిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమా బిగ్గెస్ట్ ఈవెంట్ ని కూడా మేకర్స్ ఈ జూన్ 6న తిరుపతి లో వెంకటేశ్వర యూనివర్సిటీ గ్రౌండ్ లో అట్టహాసంగా చేస్తున్నట్టుగా ఇపుడు కన్ఫర్మ్ చేశారు.

మరి ఇదిలా ఉండగా ఈ భారీ సినిమా ఈవెంట్ పై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఒకటి వైరల్ గా మారుతుంది. ఈ సినిమా ఈవెంట్ ని అయితే మన టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హోస్ట్ చేయనున్నాడని ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే లాస్ట్ టైం ప్రభాస్ రాధే శ్యామ్ కి జాతి రత్నాలు హీరో నవీన్ పొలిశెట్టి చేయగా ఈసారి మేకర్స్ తేజ సజ్జ తో చేయనున్నారని తెలుస్తుంది.

అయితే వేరే ఫీమేల్ యాంకర్ తో పాటుగా తేజ కనిపిస్తాడని తెలుస్తుంది. ఇక ఈ ఈవెంట్ కి తాను ఎందుకు హోస్ట్ చేస్తున్నాడంటే తమ చిత్రం “హనుమాన్” ప్రమోషన్స్ కి కూడా ఈ వేదిక పర్ఫెక్ట్ అని అందుకే ఇలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

పైగా ఈ ఈవెంట్ ని అయితే హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ సారథ్యంలోనే ఇప్పుడు ప్లానింగ్ లు జరుగుతున్నాయని అది కూడా ఇంకో కారణం అన్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. మరి దీనిపై మరిన్ని డీటెయిల్స్ రావాల్సి ఉన్నాయి.