టాలీవుడ్ సినిమా దగ్గర సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు ఆ టైం లో భారీ సినిమాల పోటీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. గత 2020 లోనే మహేష్ అల్లు అర్జున్ ల సినిమాలు ఒక రోజు గ్యాప్ తో వస్తే వాతావరణం ఓ రేంజ్ లో హీటెక్కింది.
ఇక లేటెస్ట్ గా అయితే ఈ ఏడాదిలో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు అలాగే రాజమౌలి ఆర్ ఆర్ ఆర్ సినిమాలు ఉండడం పైగా ఎవరూ వెనక్కి తగ్గకుండా ఉండేసరికి ఇది నరాలు తెగే ఉత్కంఠని రేపింది. ఎలాగో మహేష్ వెనక్కి వెళ్ళాడు కానీ పవన్ సినిమా మాత్రం RRR ఉన్నా కూడా డేట్ మార్చకపోవడంతో ఆ హీట్ మరో స్థాయిలోకి వెళ్ళింది.
సంక్రాంతి రేస్ అంటే ఆ రేంజ్ లో ఉంటుంది ఇక. అయితే వచ్చే ఏడాది కూడా కాస్త ఆసక్తిగా మారగా వీటిలో ఆల్ మోస్ట్ అన్నీ పెద్ద హీరోల సినిమాలే ఉండగా వాటికే ఎలా అనుకుంటూ ఉంటె ఇప్పుడు గ్యాప్ లో ఓ యంగ్ హీరో సినిమాతో ప్రముఖ బ్యానర్ వారు రిస్క్ తీసుకోబోతున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాలు అయితే చెప్తున్నాయి.
మరి ఈ హీరో సంతోష్ శోభన్ కాగా ఆ సంస్థ భారీ సినిమాల ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ అన్నట్టు తెలుస్తుంది. మరి వీరు అయితే జనవరి 14 డేట్ ని లాక్ చేసుకొని రిలీజ్ రాబోతున్నట్టుగా ఇప్పుడు టాక్ మొదలైంది. అయితే ఇలా వస్తే ఈ యంగ్ హీరో సినిమాకి కూడా రిస్క్ కాగా ఇతర సినిమాలకి కూడా థియేటర్స్ కొరత వచ్చి మరో రిస్క్ అని చెప్పాలి.