అప్పుడే ఓటిటిలో రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న యంగ్ హీరో సినిమా.!

ఎంత కంట్రోల్ లో పెడదామనుకున్నా కూడా ఆడియెన్స్ పల్స్ అర్ధం కాక మన తెలుగు సినిమా పెద్దలు ఈ మధ్య బాగానే చేతులు కాల్చుకుంటున్నారు. పలు సినిమాలు మంచి మౌత్ టాక్ తెచ్చుకున్నా కూడా ఎందుకో ఆడియెన్స్ అసలు కొన్ని సినిమాలు చూసేందుకు ఇష్టపడట్లేదు.

అయినా కూడా తన అదృష్టంతో థియేటర్స్ లో హిట్ అందుకున్న యంగ్ హీరో ఎవరన్నా ఉన్నారు అంటే అది కిరణ్ అబ్బవరం అనే చెప్పాలి. ఈ యంగ్ హీరో తన సినిమాలుతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకోగా రీసెంట్ గా “సమ్మతమే” అనే సినిమాతో మరో క్లీన్ హిట్ ని తన కెరీర్ లో వేసుకున్నాడు.

అయితే ఈ సినిమా గత జూన్ 24నే రిలీజ్ కాగా మూడు వారాల్లోనే ఓటిటి లో రిలీజ్ కి వచ్చేస్తుంది. తెలుగు ఓటిటి యాప్ ఆహా లో ఈ చిత్రం ఈ జూలై 14 నుంచి స్ట్రీమ్ కానున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు.

మరి మొన్ననే విరాట పర్వం కూడా ఈ రకంగానే స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఇక ఆ చిత్రానికి గోపీనాద్ రెడ్డి దర్శకత్వం వహించగా కలర్ ఫోటో ఫేమ్ తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి హీరోయిన్ గా నటించింది.