ఈ సంవత్సరం క్రేజీ న్యూస్ మేకర్ గా అల్లు అర్జున్.. దేశం మొత్తం అతడినే చూస్తోంది!

పుష్ప 2 సినిమా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఈ సినిమా కోట్ల కలెక్షన్స్ ని రాబట్టడంతోపాటు సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి ఫ్యూచర్ ని క్రియేట్ చేసింది. హీరోయిన్ నేషనల్ క్రష్ గా మారితే అల్లు అర్జున్ బన్నీ గా దేశం మొత్తం ఫేమస్ అయిపోయాడు. అంతేకాకుండా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటన వలన పెద్ద న్యూస్ మేకర్ గా కూడా మారిపోయాడు అల్లు అర్జున్.

నిజానికి ఈ సంవత్సరంలో చాలా సినిమాలు థియేటర్లోకి వచ్చాయి వెళ్లిపోయాయి అందులో కొన్ని హిట్ అయ్యాయి కొన్ని ఫ్లాప్ అయ్యాయి అయితే పుష్ప గురించి మాట్లాడుకున్నంతగా ఏ సినిమా గురించి మాట్లాడుకోలేదు. పుష్ప క్రియేట్ చేసిన హైప్ అలాంటిది. పుష్ప విడుదల కి ముందు దేశం మొత్తం మీద అనేక రాష్ట్రాలలో ఈవెంట్స్ ఏర్పాటు చేసినప్పుడు అది ఎంత పెద్ద సక్సెస్ సాధించాయో అందరికీ తెలిసిందే.

పుష్ప వన్ సినిమా సక్సెస్ పుష్ప టు పై ప్రభావం చూపించడంతో దేశం మొత్తం ఆ సినిమా విడుదల కోసం ఎదురు చూసింది. అనుకున్నట్లుగానే డిసెంబర్ 5న రిలీజ్ అయ్యి రికార్డుల మీద రికార్డు కలెక్షన్స్ సాధిస్తుంది. పాజిటివ్గా ఈ విధంగా న్యూస్ మేకర్ అయిన అల్లు అర్జున్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటన ద్వారా మరొకసారి న్యూస్ మేకర్ గా మారిపోయాడు. థియేటర్ దగ్గర మహిళా చనిపోవడానికి ఆమె బిడ్డ ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడటానికి కారణం అల్లు అర్జున్ అని చెప్పి అతడిని అరెస్టు చేయటం..

అతను బెయిల్ పై విడుదల కావడం ఇవన్నీ సోషల్ మీడియా కి మంచి స్టఫ్ ని ఇస్తున్నాయి. దేశం మొత్తం అతడినే చూసేలా చేస్తున్నాయి. కొందరు అల్లు అర్జున్ ని టాలీవుడ్ ని సపోర్ట్ చేస్తుంటే మరి కొందరు పోలీసులను, తెలంగాణ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నారు. ఏ విధంగా చూసుకున్నా పుష్పా సినిమాకి అల్లు అర్జున్ సినిమాకి సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటనకి వచ్చినంత హైప్ ఈ సంవత్సరంలో ఏ ఇన్సిడెంట్ కి జరగకపోవట విశేషం.