గాసిప్ : తెలుగులో పూజా హెగ్డేని ఇందుకే పక్కన పెడుతున్నారా?

టాలీవుడ్ లో పరిచయం అయ్యి కెరీర్ స్టార్టింగ్ లోనే భారీ ఆఫర్స్ సొంతం చేసుకొని స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అలాగే ఆ హీరోయిన్స్ లో అయితే ఒకప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో జెండా ఎగరేయగా.. 

ఇక ఆమె తర్వాత అయితే ఆమె లానే చిన్న సినిమాలతో స్టార్ట్ అయ్యి పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది డస్కీ బ్యూటీ పూజా హెగ్డే. అయితే పూజా హెగ్డే కి ఆ మధ్య టాలీవుడ్ గోల్డెన్ లెగ్ అని కూడా పేరు వచ్చింది. దీనితో పూజా డిమాండ్ కూడా భారీగా పెంచగా ఇప్పుడు మాత్రం పూజా టైం అస్సలు బాగాలేదు.

చేస్తున్న ఒక్క సినిమా కూడా హిట్ అవ్వకపోగా ఆమెని ఆల్రెడీ ఎంచుకున్న సినిమాలు నుంచి కూడా తీసేస్తున్నారు. పైగా వేరే సినిమాలు కూడా తెలుగు నుంచి ప్రస్తుతం ఆమెకి లేవు. అయితే ఇపుడు టాలీవుడ్ లో పూజా ని పక్కన పెట్టేస్తుండడంకి కారణం ఏంటి అనేది కూడా తెలుస్తుంది.

అందుకు ప్రధాన కారణం పూజా చేస్తున్న డిమాండ్ అట. ఇపుడు ఆమె సినిమాలకి మార్కెట్ లేకపోయినప్పటికీ కూడా ఆమె హైక్ చేసిన 4 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ నే ఇప్పటికీ డిమాండ్ చేస్తుందట. దీనితో ఇక వచ్చే నిర్మాతలు కూడా రావడం మానేశారు అని సినీ వర్గాల్లో లేటెస్ట్ గాసిప్. మరి డిమాండ్ లేని సమయంలో కూడా ఇలా ఉంటే మొదటికే మోసం వస్తుంది. మళ్ళీ కం బ్యాక్ ఇచ్చాక డిమాండ్ చేసినా ఓ అర్ధం ఉంటుంది కానీ పూజా ఇప్పుడు తన కెరీర్ ని ఎలా ట్రాక్ లోకి తెచ్చుకుంటుందో చూడాలి.