సరిపోయింది..”టిల్లు స్క్వేర్” అందుకే రిలీజ్ చెయ్యట్లేదట 

టాలీవుడ్ లో మెయిన్ గా యూత్ లో మంచి హిట్ అయ్యిన పలు చిత్రాల్లో యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ కెరీర్ లో భారీ హిట్ అయ్యిన చిత్రం “డీజే టిల్లు” కూడా ఒకటి. కాగా గత ఏడాది రిలీజ్ అయ్యిన ఈ చిత్రం దానికి సీక్వెల్ కూడా ఉందని కన్ఫర్మ్ చేసుకోగా ఈ సీక్వెల్ పై యువతలో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇంతే కాకుండా సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ కూడా డీజే టిల్లు పై ఉన్న అంచనాలను రీచ్ అయ్యింది. దీనితో ఈ సినిమా కోసం మరింత అసకథగా ఎదురు చూస్తున్నారు కానీ సినిమా రిలీజ్ మాత్రం ఇంతకీ రావట్లేదు ఎంతకీ రావట్లేదు. కాగా ఇప్పుడు అయితే అసలు ఈ చిత్రం ఎందుకు రిలీజ్ చెయ్యట్లేదు అని నిర్మాత క్లారిటీ ఇచ్చాడు.

ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నాగవంశీ లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ అసలు ఈ చిత్రం ఎందుకు ఇంకా రిలీజ్ కావట్లేదు అనే దానికి సమాధానం ఇచ్చారు. ఇప్పుడు పార్ట్ 2 మాకు ఎప్పుడైతే పార్ట్ 1 కన్నా బాగుంది అనిపిస్తుందో అప్పుడే రిలీజ్ చేస్తామని చెప్పేసారు.

అంటే సినిమా అనుకున్న రేంజ్ లో రావట్లేదు అనే కదా? మరి వీటితో అయితే సినిమా అసలు సరిగ్గా వస్తుందో లేదో అనే డౌట్ అందరిలో పట్టుకుంది. ఇంకా మొదటి సినిమా కంటే సీక్వెల్ లోనే సిద్దు లుక్ కూడా కొంచెం మారిపోయింది. మరి దానిపై ఉన్న అంచనాలు ఇది రీచ్ అవుతుందో లేదో చూడాలి. మెయిన్ గా రిలీజ్ ఎప్పటికి ఉంటుందో చూడాలి.