ఇండస్ట్రీ బజ్ : “సలార్” పార్ట్ 2 రిలీజ్ ఎప్పుడంటే.!

ప్రస్తుతం పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో తెరకెక్కించిన సెన్సేషనల్ ఏక్షన్ డ్రామా చిత్రం “సలార” యుఫొరియా ఇండియా వైడ్ కనిపిస్తుంది. అయితే ఈ సినిమా టీజర్ రెస్పాన్స్ తో మేకర్స్ ఈరోజే సినిమా ట్రైలర్ పై కూడా అప్డేట్ ఇచ్చేసారు.

అయితే ఇదిలా ఉండగా ఈ సినిమాని మొన్న టీజర్ తోనే ఈ సినిమా భాగాలుగా వస్తుంది అని కన్ఫర్మ్ చేసి ఫస్ట్ పార్ట్ కి “సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్” అని అనౌన్స్ చేశారు. ఇక దీనితో ఆటోమేటిక్ గా పార్ట్ 2 ప్రస్తావన కూడా వచ్చేసింది. ఐతే పార్ట్ 2 రిలీజ్ ఎపుడు ఉంటుంది అనేదానికి సమాధానం అయితే ఇప్పుడు ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయ్యింది.

కాగా ఇప్పటికే పార్ట్ 2 షూటింగ్ ని కూడా మేకర్స్ కొంతమేర కంప్లీట్ చేసేసారు. దీనితో వచ్చే ఏడాదిలోనే అందులోని ఏడాది మొదటి సగం లోనే రిలీజ్ కి సలార్ 2 వచ్చేస్తుంది అని క్రేజీ బజ్ ఇపుడు తెలుస్తుంది. దీనితో అయితే చిత్ర యూనిట్ మాత్రం మంచి ప్లానింగ్ లో ఉన్నారని చెప్పాలి.

అలాగే ఆ గ్యాప్ కూడా సినిమాకి సరిపోతుంది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో అయితే పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తుండగా ఈ సినిమా కేజీఎఫ్ సినిమాలతో కూడా లింకప్ అయ్యి ఉంది. దీంతో మరింత హైప్ దీనిపై నెలకొంది. ఇక ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఈ ఏడాది సెప్టెంబర్ 28న పెద్ద ఎత్తున ఐమ్యాక్స్ వెర్షన్ లో కూడా రిలీజ్ కాబోతుంది.