“సలార్” ఓటిటి రిలీజ్ ఎప్పుడంటే??

ప్యాన్ ఇండియా హీరో హీరో ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రమే “సలార్”. మరి బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నుంచి అఫీషియల్ గా అనౌన్స్ అయ్యిన మరో బిగ్గెస్ట్ సిరీస్ ఇది కాగా దీనిని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇప్పుడు థియేటర్స్ లో సలార్ సీజ్ ఫైర్ థియేటర్స్ లో ఊచకోత కోస్తుండగా దీని తర్వాత “సలార్ శౌర్యంగ పర్వం” పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

ఇక సోలార్ వచ్చి మూడు రోజులే అయ్యింది కానీ ఈ మూడు రోజుల్లోనే 400 కోట్లకి పైగా రాబట్టినట్టుగా మేకర్స్ తెలిపారు. ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని లెక్కలు మారే పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇక దీనిని పక్కన పెడితే అప్పుడే ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి సంబంధించి కొన్ని రూమర్స్ ఇప్పుడు మొదలయ్యాయి.

ఈ సినిమాని టాప్ మోస్ట్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి సంస్థలో సలార్ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల నుంచి అందుబాటులోకి వస్తుంది అని ఇప్పుడు సమాచారం. కాగా ఈ సినిమా ఫిబ్రవరి నెల మొదటి వారం లోనే వచ్చేస్తుంది అని కూడా అంటున్నారు.

మరి సలార్ కోసం చూస్తున్న వారికి ఇది సూపర్ న్యూస్ అనే చెప్పాలి. ఇంకా ఈ మాసివ్ ప్రాజెక్ట్ లో ఇంట్రెస్టింగ్ గా ఎక్కువమంది తెలుగు నటులు కన్నడ నటులు నటించగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే పృథ్వీ రాజ్ కీలక పాత్రలో నటించాడు. పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ గా క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయ్యింది.