లేటెస్ట్ గా ఓటిటి లో సెన్సేషన్ రేపుతున్న క్రేజీ ఎపిసోడ్ ఏదన్నా ఉంది అంటే అది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు నందమూరి నటసింహ బాలయ్య లపై తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహ” వారు ప్లాన్ చేసిన లేటెస్ట్ బాహుబలి ఎపిసోడ్స్ అనే చెప్పాలి. దీనిపై మంచి క్రేజ్ నెలకొనడం డార్లింగ్ ఫ్యాన్స్ దెబ్బకి ఆహా యాప్ కూడా క్రాష్ అయ్యిపోవడం వంటివి ఆసక్తిగా మారాయి.
ఇక దీని తర్వాత అసలు సిసలు ఎపిసోడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఉంది. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ ఎపిసోడ్ బాలయ్య పవన్ ల మధ్య జరిగింది. దీనితో ఇరు వర్గాల్లో కూడా కేజ్రీగా మారిన ఈ ఎపిసోడ్ ఎప్పుడు నుంచి స్ట్రీమింగ్ కి వస్తుంది అనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తెలుస్తుంది.
మరి ఈ ఎపిసోడ్ ని అయితే ఆహా యాజమాన్యం ఈ జనవరి చివరలో స్ట్రీమింగ్ కి తీసుకురానున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. ఇది కానీ మిస్ అయితే ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో ఈ ఎపిసోడ్ ని తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ క్రేజీ ఎపిసోడ్ ని కూడా రెండు భాగాలుగా చేసారా..
లేక సింగిల్ గానే చేసారా అనే ఇతర అంశాలు ఇంకా బయటకి రావాల్సి ఉన్నాయి. ఇప్పటికే ఈ ఎపిసోడ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. దీనితో మాత్రం ఖచ్చితంగా ముందు రికార్డులు అయితే తుడిచిపెట్టుకుపోతాయి అని పవన్ సహా బాలయ్య ఫ్యాన్స్ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.