గాసిప్స్ : “అఖండ 2” భారీ అనౌన్సమెంట్ ఆరోజే.?

మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఒకప్పుడు అయితే ఫ్యాక్షన్ సినిమాల్లో దర్శకుడు బి గోపాల్ ఎలాంటి రేంజ్ హిట్ లు అప్పుడు తనకి అందించారో మళ్ళీ తన కెరీర్ లో తనతో వర్క్ చేసిన ఏ దర్శకుడు కూడా బాలయ్య ని ఆ రేంజ్ మాస్ లో చూపించలేకపోయారు.

అసలు బాలయ్య మాస్ ని కరెక్ట్ విధానంలో వాడుకుంటే ఎలా ఉంటుందో చూపించిన మరో ఒక్క దర్శకుడు బోయపాటి శ్రీను అని చెప్పడంలో సందేహమే లేదు. అప్పుడు సింహా, తర్వాత లెజెండ్ ఆ తర్వాత అఖండ సినిమాలతో ఓ రేంజ్ లో బాలయ్య ని ఎలివేట్ చేసి భారీ స్టార్డం ని మరింత పెంచాడు.

ఇక “అఖండ” సినిమాతో అయితే బాలయ్య కెరీర్ లో అందుకోని ఎన్నో రికార్డులు వసూళ్లు ఈ సినిమా అందుకోగా దాని తర్వాత ఈ యూనిక్ రోల్ తోనే అఖండ పార్ట్ 2 కూడా ఉందని తాను అయితే కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ బోయపాటి శ్రీను కూడా అఖండ సీక్వెల్ ఉందని కన్ఫర్మ్ చేయగా.

ఇప్పుడు దీనికి సన్నాహాలు ముహూర్తం ఖరారు అయ్యినట్టుగా సినీ వర్గాల్లో గాసిప్స్ వినిపిస్తున్నాయి. కాగా గతంలో అఖండ పై బిగ్ అప్డేట్ లాక్ డౌన్ సమయంలో జూన్ 10న అయితే బాలయ్య పుట్టినరోజు కానుకగా అందించగా ఈసారి పుట్టినరోజు కి అఖండ 2 ని అనౌన్స్ చేసే అవకాశాలు చాలా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ అవైటెడ్ సీక్వెల్ అయితే ఎప్పుడు వస్తుందో లేదో చూడాలి.