పాన్ ఇండియా మార్కెట్ లో మోస్ట్ అవైటెడ్ గా ఉన్న చిత్రాల్లో తెలుగు సహా హిందీ భాషల్లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న మైథలాజికల్ వండర్ చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన మాసివ్ చిత్రం ఇది.
అయితే రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాపై హైప్ టీజర్ రాక ముందు వరకు ఒకలా టీజర్ వచ్చాక ఒకలా ఉందని చెప్పాలి. కాగా ఇప్పుడు అంతా పోస్టర్ లతో మేకర్స్ చూపిస్తున్నారు కానీ వీడియో విజువల్ ట్రీట్ కోసం అభిమానులు ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరి దీనిపై అయితే బాలీవుడ్ వర్గాల నుంచి లేటెస్ట్ బజ్ తెలుస్తుంది. ఆదిపురుష్ నుంచి నెక్స్ట్ టీజర్ గాని లేదా ట్రైలర్ గాని ఈ వచ్చే మే నెల మధ్యలో అయితే చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఆదిపురుష్ నుంచి ఆ బిగ్ ట్రీట్ మే లో ఫిక్స్ అయ్యిందని చెప్పాలి.
కాగా ఈ సినిమాలో ప్రభాస్ రామునిగా కృతి సనన్ జానకి దేవిగా అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ అయితే రావణాసుర పాత్రల్లో నటించారు. అలాగే ఈ సినిమా ఈ జూన్ 16న గ్రాండ్ గా వీలైనన్ని భాషల్లో 3డి లో కూడా రిలీజ్ కానుంది. అలాగే ఇంగ్లీష్ వెర్షన్ ని కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారని కూడా టాక్ ఉంది.
