“సలార్” పార్ట్ 2 టైటిల్ ఏంటంటే..!

ఇండియన్ సినిమా దగ్గర బాహుబలి సిరీస్ తర్వాత ఎన్నో సినిమాలకి అనేక ఇండస్ట్రీల నుంచి సీక్వెల్స్ కి ఊపిరిని పోసింది. మరి ఈ సిరీస్ ని స్టార్ట్ చేసిన హీరోనే ప్రభాస్ కాగా ఈ పాన్ ఇండియా హీరో నుంచి రానున్న మరో సెన్సేషనల్ సిరీస్ నే “సలార్” సిరీస్ అని చెప్పాలి.

కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా ఈ సిరీస్ లో మొదటి సినిమా “సలార్ సీజ్ ఫైర్” ఈరోజు రిలీజ్ అయ్యింది. ఇక థియేటర్లు లో భారీ రెస్పాన్స్ ని నమోదు చేస్తున్న ఈ సినిమాకి సీక్వెల్ కి ఏం టైటిల్ పెట్టారు అనేది రివీల్ అయ్యింది.

సలార్ పార్ట్ 1 కి ప్రశాంత్ నీల్ ఒక ఇంగ్లీష్ టైటిల్ ని పెడితే పార్ట్ 2 కి మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఒక సాంస్కృతిక పేరుని పెట్టడం విశేషం. కాగా పార్ట్ 2 ని అయితే “సలార్ – శౌర్యంగ పర్వం” గా నామకరణం చేసాడు. దీనితో ఈ సినిమా టైటిల్ ఆసక్తిగా మారింది.

ఇంకా ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా రిలీజ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో టైం డిసైడ్ చేయాలి. కాగా ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా పృథ్వీ రాజ్ సుకుమారన్ ప్రభాస్ కి ప్రాణ స్నేహితునిగా సినిమాలో అత్యంత కీలక పాత్ర చేసాడు. అలాగే ఈ చిత్రంలో బాబీ సింహ జగపతి బాబు తదితరులు నటించారు.