గత కొన్ని వారాల కితం టాలీవుడ్ నుంచి “దసరా” సినిమా మంచి అంచనాలు మధ్య పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయ్యింది ఇక దీని తర్వాత పాన్ ఇండియా రిలీజ్ గా వచ్చిన మరో టాలీవుడ్ సినిమానే “విరూపాక్ష”. మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు అనే కొత్త దర్శకుడు తెరకెక్కించారు.
మరి ఈ సినిమా అయితే యూఎస్ లో మొదటి షో నుంచే సూపర్ పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. దీనితో సాయి ధరమ్ తేజ్ ఖాతాలో మంచి హిట్ పడినట్టే అని కన్ఫర్మ్ అయ్యింది. అయితే తన గత సినిమా బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ బాగోకపోయినా ఈ సినిమాకి సాలిడ్ బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తుంది. కాగా ఈ సినిమాకి అయితే వరల్డ్ వైడ్ గా 25 నుంచి 27 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకుందట.
ఇది సాయి తేజ్ కెరీర్ లో మరో పెద్ద బిజినెస్ నెంబర్ కాగా దీనిని దాటితే తప్ప ఈ సినిమా సేఫ్ కాలేదని చెప్పాలి. టాక్ ఎలాగో బాగుంది కాబట్టి వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉంది కానీ ఈ మొత్తాన్ని ఛేజ్ చేయాలి అంటే ఖచ్చితంగా మరింత స్ట్రాంగ్ రన్ ని నమోదు చేయాలి. మరి ఈ సినిమాకి ఏమవుతుందో చూడాలి. ఇంకా ఈ సినిమాకి అజనీష్ సంగీతం అందించగా సుకుమార్ బి వి ఎస్ ఎన్ ప్రసాద్ లు నిర్మాణం వహించారు.