వైరల్ : ప్రభాస్ “ప్రాజెక్ట్ కే” స్టోరీ ఇదే.!

ప్రస్తుతం పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో టాలీవుడ్ దర్శకుడు నాగశ్విన్ తో చేస్తున్న భారీ పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ లెవెల్ చిత్రం “ప్రాజెక్ట్ కే”. కాగా ఈ చిత్రంపై ఇపుడు హైప్ అంతకంతకు పెరుగుతూ వెళ్తుండగా..

ఈ సినిమా లో రీసెంట్ గానే ఉలగనయగన్ కమల్ హాసన్ జాయిన్ కాగా ఈ చిత్రం స్టోరీ పై ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు. కానీ కొన్ని ఇంట్రెస్టింగ్ లైన్స్ వినిపించాయి. మన పురాణాలూ అలాగే వర్తమాన భవిష్యత్ కాలాల్లో సినిమా ఉంటుంది అని టాక్ ఉంది.

అయితే ఇపుడు ఏకంగా టోటల్ స్టోరీ లైన్ బయటకి వచ్చేసింది. దీని ప్రకారం అయితే ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీ విష్ణు అవతారంగా కనిపిస్తాడట. భూమిపై భవిష్యత్ కాలంలో కమల్ హాసన్ ఓ క్రూరమైన విలన్ కాగా తనని అతని సైన్యం ని అంతం చేయడానికి ఆ మహా విష్ణువే(ప్రభాస్) అవతారం ఎత్తి కమల్ హాసన్ తన దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ ఆయుధాలతో మట్టు పెడతాడట.

దీంతో ఇదే కథతో సినిమా వస్తుంది అని ఓ టాక్ ఇప్పుడు వైరల్ గా మారింది. మరి ఈ సినిమా ఇదే లైన్ తో ఉంటుందా లేదా అనేది మాత్రం మరికొంత కాలం ఆగి చూడాల్సిందే. కాగా ఈ చిత్రంలో అయితే కమల్ సహా దీపికా పదుకొనె అలాగే అమితాబ్ బచ్చన్ దిశా పాటని తదితర స్టార్స్ నటిస్తున్నారు.