ప్రభాస్ వరల్డ్ “ప్రాజెక్ట్ కే” లో మొట్టమొదట స్టార్ట్ ఇదే.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రాల్లో వరల్డ్ లెవెల్ సినిమాగా అనౌన్స్ చేసిన చిత్రం “ప్రాజెక్ట్ కే” కూడా ఒకటి. ఈ సినిమాని మహానటి, ఎవడే సుబ్రహ్మణ్యం దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు.

ఓ సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ వరల్డ్ లెవెల్లో భారీ స్కై ఫై ఏక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. మరి ఈ భారీ సినిమా పై అయితే ఇప్పుడు చిత్ర బృందం ఓ వెరీ ఇంట్రెస్టింగ్ మేకింగ్ వీడియోని రిలీజ్ చేసారు. ఈ సినిమా కోసం ప్రతి దాన్ని కూడా కొత్తగా తయారు చేయాల్సి వచ్చింది అని చిత్ర యూనిట్ చెప్పిన సంగతి తెలిసిందే.

మరి అలా ఈ సినిమాలో మొట్ట మొదటగా ఏం తయారు చేసారో అనేది రివీల్ చేశారు. ఈ సినిమాలో అయితే మొట్ట మొదటగా ఓ చక్రాన్ని తయారు చేసినట్టుగా తెలిపారు. అయితే చరిత్ర చూసుకుంటే చక్రానికి చాలా కీలక పాత్ర ఉంది. అందుకే దీనిని మొదటిగా సినిమా స్టార్ట్ తో మొదలు పెట్టారు.

మరి ఓ సరికొత్త మోడల్ అండ్ డిజైన్ లో కనిపించిన ఈ టైర్ ని తయారు చేయడానికి చిత్ర యూనిట్ పడ్డ కష్టం కూడా అంతా ఇంతా కాదు. అలా ఫైనల్ గా అయితే ఈ కొత్త ఏడాది ట్రీట్ గా కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్తూ తమ “స్క్రాచ్” అంటే మొదలు ఎక్కడ నుంచి అనే వీడియోతో మొదటి వీడియోని వదిలారు. దీనితో ఇది ఆసక్తిగా మారి సినీ వర్గాల్లో వైరల్ గా మారగా అభిమానుల్లో ఆసక్తిగా మారుతుంది.
From Skratch Ep1: Re-Inventing the Wheel - Kalki 2898 AD | Project K | Vyjayanthi Movies