ఇండస్ట్రీ టాక్ : టాలీవుడ్ లో హ్యాట్రిక్ సినిమా ఓకే చేసిన తమిళ్ హీరో.?

తమిళ్ లో అలాగే తెలుగుతో పాటుగా అలాగే గ్లోబల్ గా కూడా మంచి ఫేమ్ ఉన్న హీరో ధనుష్ ఇప్పుడు పలు భాషల్లో అనేక చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ లైనప్ లో ధనుష్ మన టాలీవుడ్ నుంచి కూడా పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

మరి వాటిలో “సార్” అనే చిత్రం అల్రెడీ దర్శకుడు వెంకీ అట్లూరి తో స్టార్ట్ చేసి ముగించనుండగా నెక్స్ట్ మరో టాలీవుడ్ మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తో ఓ పాన్ ఇండియా సినిమా ధనుష్ చేయనున్నాడు. ఇక ఇప్పుడు మరో లేటెస్ట్ ఇండస్ట్రీ టాక్ ఏమిటంటే ధనుష్ ముచ్చటగా మరో టాలీవుడ్ దర్శకునితో వర్క్ చేయనున్నట్టుగా తెలుస్తుంది.

మరి మరిన్ని డీటెయిల్స్ కి వెళితే ఈ చిత్రాన్ని అయితే పాన్ ఇండియా ప్రొడ్యూసర్ గా మారిన నిర్మాత దిల్ రాజు టేకప్ చేయనున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది కాలమే నిర్ణయించాలి. మరి దీనితో ధనుష్ అయితే ముచ్చటగా హ్యాట్రిక్ సినిమాని ఓకే చేసాడని చెప్పాలి. అలాగే దర్శకుడు పేరు కూడా ఇంకా ఫైనలైజ్ కావాల్సి ఉంది. ప్రస్తుతం దిల్ రాజు ఆల్రెడీ చేసిన తమిళ్, తెలుగు చిత్రం వారసుడు రిలీజ్ కి సిద్ధంగా ఉంది.