ఇన్సైడ్ టాక్ : పవన్ సినిమాతో విస్తుపోయిన ప్రముఖ నటుడు?

ప్రస్తుతం టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క తన సినిమాలు అలాగే మరో పక్క పవన్ పాలిటిక్స్ లో కూడా యమ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా పవన్ చేస్తున్న లేటెస్ట్ సినిమాల్లో అయితే ఓ సినిమా విషయంలో ఆ సినిమాలో నటిస్తున్న ఓ ప్రముఖ నటుడు బాగా విస్తుపోయాడని తెలుస్తుంది.

అయితే ఇంకొంచెం డీటైల్డ్ గా వెళితే పవన్ ఇప్పుడు చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో తాను ఎప్పుడో స్టార్ట్ చేసిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. కాగా ఈ సినిమాపై మంచి హైప్ ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా షూటింగ్ మాత్రం భారీగా ఆలస్యం అవుతూ వస్తుంది.

దీనితో ఈ సినిమా షూటింగ్ కి అనేకమంది ప్రముఖ నటులు డేట్స్ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియకపోవడంతో ఓ ప్రముఖ నటుడు తనంత తానే ఈ సినిమా నుంచి బయటకు వచ్చేసినట్టుగా సినీ వర్గాల్లో లేటెస్ట్ గా వచ్చిన సమాచారం.

మరి ఆ నటుడు ఎవరో అనేది తెలియాల్సి ఉంది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుండగా బాలీవుడ్ నుంచి పలువురు స్టార్ నటులు కూడా నటిస్తున్నారు. అలాగే ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.