ఇన్సైడ్ టాక్ : పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న నందమూరి నటుడు.?

సినిమా నుంచి రాజకీయాల వరకు వచ్చిన వారిలో మన టాలీవుడ్ నుంచి వచ్చినవాళ్లే చాలా మంది ఉన్నారు. అయితే తెలుగు వరకు వస్తే నందమూరి కుటుంబం నుంచి వచ్చిన అనేక తారకు ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా కీలక పాత్ర పోషిస్తారని తెలిసిందే.

ఇప్పటికే నందమూరి బాలయ్య, గతంలో నందమూరి తారకరామారావు కీలక పాత్ర పోషించగా ఇప్పుడు వారి కుటుంబం నుంచే చాలా మంది కూడా యాక్టీవ్ గా ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా మరో నందమూరి హీరో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

మరి దీనితో అయితే ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న డైరెక్ట్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా ఇప్పుడు సినీ వర్గాలు చెప్తున్నాయి. మరి తాను టీడీపీ లోకే వెళతారా లేక మరో పార్టీ లోకి వెళ్తాడా లేక అనే వివరాలు ఇంకా తెలియరాలేదు కానీ..

తన పొలిటికల్ ఎంట్రీ మాత్రం ఉండొచ్చు అనే గాసిప్స్ ఇప్పుడు మొదలయ్యాయి. తాను అయితే హీరోగా కెరీర్ స్టార్ట్ చేసినా ఇప్పుడు పలు పాత్రలు మాత్రమే చేస్తున్నాడు. ఇప్పుడు అయితే అవి కూడా తగ్గాయి మరి దీనితో ఇప్పుడు ఈ టాక్ సినీ మరియు రాజకీయ వర్గాల్లో వైరల్ గా మారింది.